Movie News

తెలుగు నిర్మాతలు.. అంత దారుణం చేస్తున్నారా?

తమిళ్ రాకర్స్.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సౌత్ ఇండియాలో ఏ కొత్త సినిమా రిలీజైనా కొన్ని గంటల్లో పైరసీ ప్రింట్ ఈ వెబ్ సైట్లో ప్రత్యక్షమవుతుంది. ప్రధానంగా తమిళ సినిమాల మీదే ఈ సంస్థ ఫోకస్ ఉంటుంది కానీ.. వేరే భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంటుంది ఈ సంస్థ. దీని అడ్మిన్ ఎక్కడో విదేశాల్లో ఎవరికీ దొరక్కుండా సర్వర్ మెయింటైన్ చేస్తూ.. కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. ఈ వెబ్ సైట్‌ను నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఆ వెబ్ సైట్‌ను నిషేధిత జాబితాలో పెట్టి అది పని చేయకుండా చేసినా.. తన సబ్‌స్క్రైబర్లకు మెయిల్ ద్వారా పైరసీ లింక్స్ పంపిస్తూ.. ఈ బిజినెస్‌ను విజయవంతంగా నడిపిస్తున్నాడు అడ్మిన్. ఆ వ్యక్తితో తాజాగా ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూ నిర్వహించింది. పైరసీ వ్యవహారాల మీద తమిళ్ రాకర్స్ అడ్మిన్ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు ఈ ఇంటర్వ్యూలో.

ఇలా కొత్త సినిమాలను పైరసీ చేసి ఇంటర్నెట్లో అందరికీ షేర్ చేయడం నైతికంగా ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తే.. ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం చూసి దిమ్మదిరిగిపోవాల్సిందే. ఫిలిం ఇండస్ట్రీలో అందరూ దొంగలే అని.. ఒకరినొకరు మోసం చేసేవారేనని.. కొత్త సినిమాల పైరసీ విషయంలో తనకు ఇండస్ట్రీ జనాలే సహకారం అందిస్తుంటారని అతను చెప్పడం గమనార్హం. కమల్ హాసన్ సినిమా ఉత్తమ విలన్ విడుదలైన మూడు గంటలకే తన చేతికి హెచ్డీ ప్రింట్ వచ్చిందని.. ఇండస్ట్రీలోని వ్యక్తులే తనకు డబ్బులిచ్చి ఆ సినిమా పైరసీ ప్రింట్‌ను రిలీజ్ చేయాలని చెప్పారని.. ఇలా చాలా సినిమాలకు జరిగిందని అతను వెల్లడించడం షాకింగే.

అంతే కాక ఈ మధ్య ఒకే తేదీకి రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కాగా.. అందులో ఒక సినిమా నిర్మాత.. ఇంకో సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేయాలని తమను సంప్రదించాడని.. ఇలా ఇండస్ట్రీలోనే పెద్ద దొంగలు ఉన్నారని.. అలాంటపుడు పైరసీ చేస్తున్న తమ గురించి బయటపెట్టడం, శిక్షించడం ఎలా సాధ్యం అవుతుందని తమిళ్ రాకర్స్ అడ్మిన్ ప్రశ్నించడం గమనార్హం. బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎదురైనపుడు అన్ని సినిమాలూ బాగా ఆడాలి, అందరూ బాగుండాలి అని కామెంట్లు చేసే నిర్మాతలు.. తెర వెనుక ఇలాంటి దారుణాలు చేస్తున్నారంటే షాకవ్వాల్సిందే.

This post was last modified on June 23, 2022 2:37 pm

Share

Recent Posts

సుమంత్ అదే దారిలో వెళ్తే ఎలా

హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…

57 minutes ago

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

2 hours ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

3 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

4 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

4 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

5 hours ago