నాగ చైతన్య దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా కోసం అరుదైన కలయికను సాధ్యం చేస్తున్నారు. ఇళయరాజా ఆయన వారసుడు యువన్ శంకర్ రాజా సంయుక్తంగా చైతుకి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. గత ఏడాది వెంకట్ ప్రభు ఇచ్చిన సూపర్ హిట్ మూవీ మానాడు రీమేక్ అనే ప్రచారం గతంలో జరిగింది కానీ నిజానికి ఇప్పుడు తీసుకున్నది ఫ్రెష్ సబ్జెక్ట్. కాకపోతే ఏ జానర్ అనేది బయటికి రాలేదు.
ఇళయరాజాకు నాగార్జునకు మంచి హిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆఖరి పోరాటంలో ఎప్పటికీ మర్చిపోలేని పాటలు ఇచ్చారు. చైతన్య ఎంత డిజాస్టర్ అయినా అందులో ఓహో లైలా ఓ చారుశీలా ఇప్పటికీ పాడుకునే ఎవర్ గ్రీన్ యూత్ క్లాసిక్. నిర్ణయం గురించి చెబితే పుస్తకమే అవుతుంది. కిల్లర్ లో ప్రియా ప్రియతమా పాటను ఇష్టపడని మ్యూజిక్ లవర్స్ ఉండరు. అంతగా నాగ్ తో రాజా గారి బాండింగ్ ఉంది. చాలా కాలం నుంచి తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ తగ్గించేసిన ఇళయరాజా మొదటిసారి చైతుకి ట్యూన్స్ కట్టబోతున్నారు.
ఇక యువన్ కు టాలీవుడ్ కొత్తేమి కాదు.హ్యాపీ, ఆడవాళ్ళ మాటకు అర్థాలే వేరులే, ఓయ్, పంజా, గోవిందుడు అందరివాడేలే లాంటి మంచి ఆల్బమ్స్ పడ్డాయి. కాకపోతే తండ్రి కొడుకులు కలిసి తెలుగు స్ట్రెయిట్ మూవీకి పని చేయడం మాత్రం ఇదే మొదటిసారి. టైటిల్ ఇంకా ప్రకటించలేదు కానీ ప్రొడక్షన్ నెంబర్ కు పెట్టిన లోగో గట్రా చూస్తుంటే ఏదో కేసుకి సంబంధించిన క్రైమ్ డ్రామాలా తోస్తోంది. టిపికల్ స్క్రీన్ ప్లేతో అలరించే వెంకట్ ప్రభు చైతుని ఎలాంటి సబ్జెక్టులో ప్రెజెంట్ చేయనున్నాడో చూడాలి.
This post was last modified on June 23, 2022 1:44 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…