Movie News

రష్ చూశారు.. దర్శకుడిని మార్చేశారు !

‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ తో సూపర్ హిట్ కొట్టిన కుర్ర హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య నిర్మాణంలో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అనే సినిమా తెరకెక్కుతోంది. మొన్నటి వరకూ ఈ సినిమాకు కార్తిక్ శంకర్ దర్శకుడు. ఇప్పుడు దర్శకుడు మారాడు.

సినిమాకు సంబంధించి సగంపైనే షూటింగ్ పూర్తయింది. ఇటీవలే రష్ చేసుకున్నాక సినిమా రిజల్ట్ క్లియర్ గా కనిపించడంతో ఉన్నపళంగా దర్శకుడిని మార్చేశారు. హీరో తనకి హిట్టిచ్చిన దర్శకుడు శ్రీధర్ పేరు సజిస్ట్ చేయడంతో రాత్రి కి రాత్రి పోస్టర్ మీద దర్శకుడి పేరు మారిపోయింది. సినిమా కథ కార్తిక్ దే. అందుకే అతనికి ఒక రెమ్యునరేషన్ సెటిల్డ్ చేసి పక్కన పెట్టేశారు. అయితే నిర్మాత కోడి దివ్య ఈ నిర్ణయం తీసుకోవడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది.

‘నేను మీకు బాగా కావాలిసిన వాడిని’ తన బేనర్ కి మొదటి సినిమా. పైగా పోస్టర్ పై కోడి రామకృష్ణ సమర్పణ అని తండ్రి పేరు వేస్తున్నారు. సినిమా తేడా వస్తే తండ్రి పేరు చెడగొట్టినట్టు అవుతుంది. అలాగే మొదటి సినిమా రిజల్ట్ అనుకున్న విధంగా రాకపోతే ప్రొడక్షన్ లో నెక్స్ట్ సినిమా కష్టమే. అందుకే కార్తిక్ తీసిన రష్ చూసి హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి హీరో కూడా ఊ కొట్టి తనకి సింక్ అయిన దర్శకుడ్ని రంగంలోకి దింపాడు. పైగా హీరో -దర్శకుడు ఆల్రెడీ హిట్ కొట్టారు కాబట్టి మార్కెట్ చేసుకోవడం ఈజీ అవుతుంది.

మొన్నీ మధ్య విశ్వక్ సేన్ కూడా ‘పాగల్’ డైరెక్టర్ నరేష్ కి రెండో సినిమా ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ తనే డైరెక్షన్ చేస్తున్నాడు. సెట్స్ పైకి వెళ్లకముందే స్టోరీ సిట్టింగ్ లో విభేదాలు రావడంతో ‘ధమ్కీ’ విషయంలో సడెన్ గా డిసిషన్ తీసేసుకున్నాడు. ఏదేమైనా కుర్ర హీరోలు హిట్టే టార్గెట్ గా పెట్టుకొని ఇలా ఉన్నపళంగా దర్శకులను మార్చేస్తున్నారు. ఈ రెండు సినిమాల రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా వీళ్ళ డిసీషన్ తప్పైనట్టే.

This post was last modified on June 23, 2022 9:30 am

Share
Show comments

Recent Posts

కొంప ముంచిన ఇండిగో స్ట్రాటజీ

హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…

15 minutes ago

చంద్రబాబు, పవన్, లోకేష్ పై అంత మాట అన్నారంటి జగన్?

ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…

35 minutes ago

కుర్రాడి సంగీతం కావాలన్న సూపర్ స్టార్

కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…

2 hours ago

మరో రాజకీయ చెల్లి! అన్నతో విబేధాలు లేవంటూ..

తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…

3 hours ago

అర్ధరాత్రి మాట కోసం ‘అఖండ 2’ సిద్ధం

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…

4 hours ago

త్వ‌ర‌లో అమ‌రావ‌తి ‘మూడో ద‌శ‌’.. ఏంటిది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి.. మ‌రిన్ని కొత్త సొబ‌గులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్ప‌టికే నిర్మాణ ప‌నులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబ‌వ‌ళ్లు…

7 hours ago