Movie News

హాట్ టాపిక్ గా మారిన బండ్ల స్పీచ్

తన స్పీచ్ లతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేసే నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన స్పీచ్ తో హాట్ టాపిక్ గా మారాడు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బండ్ల దర్శకుడు పూరికి గట్టిగా క్లాస్ పీకాడు.

ఆకాష్ ‘చోర్ బజార్’ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా పూరి కనిపించలేదు. కేవలం షూటింగ్ కి ఒకసారి మాత్రమే హాజరయ్యాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తప్పనిసరిగా పూరి ఎటెండ్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఈవెంట్ కి రాకుండా ముంబైలో బిజీ అయిపోయాడు పూరి. తనయుడి ఈవెంట్ కి పూరి రాకపోవడంతో బండ్ల గణేష్ హర్ట్ అయి బరస్ట్ అయిపోయాడు.

నువ్వు కొడుకు సినిమా ఫంక్షన్ కి ముంబై నుండి రాలేనంత బిజీగా ఉన్నావా ? అంటూ వేదికపై నుండి పూరిని నేరుగా ప్రశించించాడు బండ్ల గణేష్. నేనైతే లండన్ లో ఉన్నా స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చేవాడిని నేను బ్రతికేదే నా పిల్లల కోసం అంటూ చెప్పుకున్నాడు. అన్నా ఇంకో సారి ఇలాంటి పని చేయకు నీకు దణ్ణం పెడతా అంటూ రిక్వెస్ట్ చేశాడు. మనం ఎంత ఎదిగినా, ఎంత సంపాదించినా అదంతా పిల్లల కోసమే , ఎక్కడున్నా వాళ్ళ కోసం రావాల్సిందేనని అన్నాడు. పిల్లలు నీ భాద్యత అంటూ పూరి కి గుర్తుచేశాడు. రేపు ఆకాష్ స్టార్ అయ్యాక నీతో సినిమా చేయిద్దని చెప్తా అంటూ చమత్కరించాడు కూడా.

అదే వేదికపై పూరి భార్య లావణ్యని భరత మాతతో పోలుస్తూ ఆమె ఉత్తమ ఇల్లాలని, ఓపిక ఎక్కువని, పూరి దగ్గర డబ్బు లేని సమయంలో అతని వెంటే ఉందని, స్టార్డం వచ్చాక చాలా మంది వచ్చారు కానీ ఆమె గొప్ప వ్యక్తి అంటూ పూరీని అంటి పెట్టుకుని ఉండే వారికి చురకలు అంటించాడు.

ఫైనల్ గా.. పూరి ఎందర్నో స్టార్లను , సూపర్ స్టార్లను చేస్తే వాళ్ళు ఆకాష్ ని ప్రోత్సహించి ప్రమోషన్ చేయకుండా తమకి పోటీ వస్తాడని భయపడుతున్నారని పూరి హీరోలపై కామెంట్స్ చేశాడు బండ్ల. చివరిగా ఆకాష్ పూరి పెద్ద స్టార్ అవుతాడని దాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశాడు. ఏదేమైనా పబ్లిక్ ఫంక్షన్ లో పూరి కి భారీ క్లాస్ పీకుతూ స్టార్ హీరోలపై కామెంట్స్ చేస్తూ తన స్పీచ్ తో దుమారం రేపాడు బండ్ల. మరి ఈ స్పీచ్ పై పూరి స్పందిస్తాడా లేదా లైట్ తీసుకుంటాడా ? చూడాలి.

This post was last modified on June 23, 2022 9:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రోజు నాన్ వెజ్ తినడం వల్ల ఎన్ని సమస్యలో తెలుసా?

ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…

25 minutes ago

2024 ఖేల్ రత్న విజేతలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…

9 hours ago

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుత సందేశం… పాటిస్తారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానుల‌కు అద్భుత సందేశం ఇచ్చారు. త‌న‌ను అభిమానిం చేవారు... త‌ప్ప‌కుండా పాటించాల‌ని…

9 hours ago

మహేష్-రాజమౌళి సినిమా రిలీజ్.. చరణ్ అంచనా

ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…

9 hours ago

హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…

11 hours ago

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

13 hours ago