వచ్చే ఏడాది సంక్రాంతి పోటీలో కొన్ని బడా సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో విజయ్ ‘వారసుడు’ ఒక్కటే అఫీషియల్ గా ప్రకటించారు. అయితే మహేష్ -త్రివిక్రమ్ కాంబో సినిమా కూడా సంక్రాంతికే రానుందని ఎనౌన్స్ మెంట్ నుండే ప్రచారం జరిగింది. మొన్నటి వరకూ ఈ సినిమా పొంగల్ కి రావడం పక్కా అనే టాక్ గట్టిగా వినిపించింది. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. అవును మహేష్ సినిమా సంక్రాంతి పోటీ నుండి తప్పుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ చిన్న హింట్ ఇచ్చి చెప్పేశారు.
సితార ఎంటర్టైన్ మెంట్స్ లో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఎనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేసి సినిమా సంక్రాంతి విడుదల అంటూ ప్రకటించారు. ఇక మహేష్ – త్రివిక్రమ్ సినిమా కూడా ఈ సంస్థలోనే తెరకెక్కనుంది. కాకపోతే మహేష్ త్రివిక్రమ్ సినిమా హారికా హాసినీ క్రియేషన్స్ లో వస్తుంది. ఈ సినిమా సితార బేనర్ లో రూపొందనుంది. తమ సంస్థలో బడా సినిమా ఏది సంక్రాంతి బరిలో లేనందునే వైష్ణవ్ తేజ్ సినిమాను 2023 సంక్రాంతి పోటీలో వదిలారనే క్లియర్ కట్ గా తెలుస్తుంది.
సో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకొని దాని ద్వారా మహేష్ సినిమా సంక్రాంతికి లేదనే విషయాన్ని మేకర్స్ చెప్పకనే చెప్పేశారు. ఇక SSMB28 వచ్చే ఏడాది సమ్మర్ కి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా జులై లో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
This post was last modified on June 22, 2022 2:13 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…