ప్రస్తుతం థియేటర్స్ వర్సెస్ ఓటీటీ ట్రెండ్ నడుస్తుంది. థియేటర్స్ లో రిలీజయ్యే సినిమాలను ఓటీటీలో రిలీజయ్యాక చూడొచ్చనే ధీమాతో ఉంటున్నారు ప్రేక్షకులు. అందుకే నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. ఓటీటీ సంస్థతో ఒప్పందం తాలూకు వివరాలు బయటికి రాకుండా దాచేస్తున్నారు. ఒకవేళ సోషల్ మీడియాలో న్యూస్ వచ్చేసిన లేదంటూ కొట్టిపారేస్తున్నారు. తాజాగా అంటే సుందరానికీ విషయంలో అదే జరిగింది.
రిలీజ్ కి ముందే సినిమా ఓటీటీ ఒప్పందం బయటికి వచ్చేసింది. జులై 1న ఓటీటీ లో రిలీజ్ అంటూ న్యూస్ చక్కర్లు కొట్టింది. దీంతో మేకర్స్ కాదని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. నాని కూడా ఈ విషయం పై స్పందించాడు. జులై 1న ఓటీటీ రిలీజ్ అనే వార్తను కొట్టి పారేశాడు. అంత త్వరగా సినిమా రాదని అవన్నీ రూమర్స్ అంటూ ధీమాగా చెప్పుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు అంటే సుందరానికీ జులై8 న నెట్ఫ్లిక్స్ లో రానుందనే ప్రచారం జరుగుతుంది. ఇంకా ముందే వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అంటే జులై మొదటి వారంలోనే నాని సినిమా ఓటీటీ లో వచ్చేయనుందన్నమాట.
ప్రస్తుతానికయితే దీనిపై నెట్ఫ్లిక్స్ నుండి ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు. డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. మరి ప్రచారంలో ఉన్నట్టే సినిమా జులై మొదటి వారంలో ఓటీటీ లో వచ్చేస్తే నాని మాట తప్పినట్లే అవుతుంది. మరి ఇలా నెలలోపే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఇక ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం కష్టమే.
This post was last modified on June 22, 2022 12:31 pm
క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి…
టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…
గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం.…
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…