Movie News

వర్మ.. ఈ దెబ్బతో తేలిపోతుంది

కెరీర్ ఆరంభంలో రామ్ గోపాల్ వర్మ బయటెక్కడా కనిపించేవాడు కాదు. మీడియాతో కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. అప్పుడు మీడియా, సోషల్ మీడియా హడావుడి కూడా ఉండేది కాదు. వర్మ సైలెంటుగా తన పని తాను చేసుకుపోయేవాడు. కేవలం ఆయన సినిమానే మాట్లాడేది. శివతో మొదలుపెట్టి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వర్మ. ఆయన స్ఫూర్తితో దేశవ్యాప్తంగా వందలు, వేల మంది ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన శిష్యులు కూడా సెన్సేషనల్ సినిమాలు తీశారు. పెద్ద డైరెక్టర్లయ్యారు.

కెరీర్లో తొలి 10-15 ఏళ్లు వర్మ మామూలు సినిమాలు తీయలేదు. అలాగే ఇండస్ట్రీ మీద మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. కానీ కెరీర్లో ఒక దశ వరకు కంటెంట్‌ను నమ్ముకున్న వర్మ.. ఆ తర్వాత దాని మీద ఫోకస్ తగ్గించి పబ్లిసిటీ మీదికి దృష్టి మళ్లించాడు. అక్కడే ఆయన ట్రాక్ తప్పేశాడు. కేవలం సెన్సేషనలిజాన్ని నమ్ముకుంటే అది ఎక్కువ కాలం నడవదు.

కొంత విషయం ఉండి, కొంత పబ్లిసిటీ తోడైతే ఓకే కానీ.. విషయం పూర్తిగా మరుగున పడిపోయి కేవలం పబ్లిసిటీనే నమ్ముకుంటే ఎలా? వర్మ ఇదే పని చేశాడు. పూర్తిగా ప్రేక్షకుల్లో క్రెడిబిలిటీ కోల్పోయాడు. వివాదాస్పద అంశాల మీద నాసిరకం సినిమాలు తీసి కొంత వరకు డబ్బులు చేసుకున్న వర్మకు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకపోయింది. ఆయన ఏ అంశం మీద సినిమా తీసినా, ఎంత పబ్లిసిటీ చేసినా, వివాదాలు క్రియేట్ చేయాలని చూసినా జనాలు పట్టించుకోవట్లేదు.

వర్మ తీసిన సినిమాలు చాలానే బిజినెస్ జరక్క మూలన పడి ఉన్నాయి. చాలా కష్టపడి ‘డేంజరస్’ అనే సినిమాను రిలీజ్ చేస్తే.. ఏదో నామమాత్రంగా ఒకటీ అరా థియేటర్లలో ఆడి వెళ్లిపోయింది. హీరోయిన్లతో విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేయించినా ఆ చిత్రాన్ని కుర్రాళ్లు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడేమో వర్మ నుంచి ‘కొండా’ అనే సినిమా రాబోతోంది. వరంగల్ జిల్లాకు చెందిన నక్సలైట్ టర్న్డ్ పొలిటీషియన్ కొండా మురళి జీవిత కథ ఆధారంగా వర్మ ఈ చిత్రం తీశాడు. కానీ ఎంత చేసినా ఈ సినిమాకు బజ్ క్రియేట్ చేయలేకపోయాడు.

వర్మ సినిమా అంటేనే జనాల్లో పూర్తిగా ఆసక్తి పోవడం ఇందుకు కారణం. దీంతో పాటు వస్తున్న సమ్మతమే, చోర్ బజార్ ఓ మోస్తరుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి కానీ.. దీనికి మాత్రం మినిమం బజ్ కనిపించట్లేదు. ఈ సినిమా ఆడితే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ‘కొండా’కు కూడా వర్మ గత సినిమాల గతే పడితే.. తన చిత్రాల పట్ల జనాలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో వర్మకు బాగా అర్థం అవుతుంది.

This post was last modified on June 22, 2022 11:32 am

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

6 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

8 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

8 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

8 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

12 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

12 hours ago