Movie News

సాహో – మెగా హీరో.. నిజమేనా మైత్రీ?

వ్రతం చెడింది ఫలితం దక్కలేదు అన్నట్టు తయారయ్యింది దర్శకుడు సుజిత్ పరిస్థితి సాహో ఫలితం వచ్చాక. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ యాక్షన్ గ్రాండియర్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఈ కుర్రాడు ఏ ప్రశాంత్ నీల్ రేంజ్ లో స్టార్ హీరోలు తన వెంట పడేలా చేసుకునేవాడు.

దానికి తోడు చేతికి వచ్చి జారిపోయిన చిరంజీవి లూసిఫర్ రీమేక్ అవకాశం కూడా తన కెరీర్ ని కొంత ప్రభావితం చేసింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా తన కొత్త సినిమా ఎవరితో ఉంటుందన్న అప్డేట్ లేకపోయింది. అతనైనా మీడియాకు కనిపిస్తేగా.

లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం సుజిత్ ఓ మెగా హీరోతో లాక్ అయ్యాడు. వరుణ్ తేజ్ తో మైత్రి మూవీ మేకర్స్ ఓ ప్రాజెక్టు సెట్ చేస్తోందట. బ్యాక్ డ్రాప్ ఏంటనే లీక్ బయటికి రాలేదు కానీ రన్ రాజా రన్ తరహాలో ఎంటర్ టైన్మెంట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారని తెలిసింది.

ఇంతకు మించి వివరాలేం రాలేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్3 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హిట్ క్రెడిట్ ని వెంకటేష్ తో పంచుకోవాల్సి వచ్చినా గని డిజాస్టర్ తాలూకు గాయం నుంచి త్వరగా బయటపడేందుకు ఎఫ్3 ఉపయోగపడిందన్నది వాస్తవం.

దీని తాలూకు అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కేవలం భారీ చిత్రాలే కాకుండా అంటే సుందరానికి టైపులో మీడియం బడ్జెట్ సినిమాల మీద కూడా మైత్రి పెట్టుబడులు పెడుతోంది.

లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే విషయంలో అందుకే స్పెషల్ ఇంటరెస్ట్ తీసుకుని మరీ నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్లు చేస్తోంది. ఎలాగూ పెద్ద హీరోలతో చేస్తున్నవి అప్పుడప్పుడూ రిస్క్ లో పెడుతుంటాయి. అలాంటప్పుడు సేఫ్ గేమ్ కోసం ఇలాంటివి చేయడం తప్పేం కాదు. మరి సుజిత్ ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.

This post was last modified on June 21, 2022 8:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

3 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

7 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

9 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

9 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

9 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

11 hours ago