Movie News

అన్‌స్టాపబుల్.. తిరిగొస్తున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ కెరీర్ గత ఆరు నెలల్లో ఊహించని టర్న్ తీసుకుంది. యన్.టి.ఆర్-కథానాయకుడు, యన్.టి.ఆర్-మహానాయకుడు, రూలర్ చిత్రాలతో బాగా డీలా పడిపోయి, ఇక మళ్లీ పుంజుకోవడం కష్టం అనుకున్న టైంలో ‘అఖండ’తో ఆయన బాక్సాఫీస్ దగ్గర చేసిన బీభత్సానికి అందరూ షాకైపోయారు. దాని కంటే ముందు ‘అన్ స్టాపబుల్’ షోతో ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు.

మామూలుగా బయట మాట్లాడేటపుడు బాలయ్యకు ఎంతగా మాట తడబడుతుందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఒక టాక్ షో చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ ‘అన్‌స్టాపబుల్’తో ఆయన పెద్ద షాకే ఇచ్చాడు. ఈ షోలో బాలయ్య చూపించిన ఎనర్జీ అన్ మ్యాచబుల్ అనే చెప్పాలి. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా ఒక కొత్త బాలయ్యను చూపించింది ఈ షో. టైటిల్‌కు తగ్గట్లే ‘అన్ స్టాపబుల్’ అనిపిస్తూ ఎపిసోడ్ ఎపిసోడ్‌కూ మరింతగా ఇంప్రెస్ చేస్తూ జనాలను ఆకట్టుకున్నాడు బాలయ్య.

ఈ షో వల్ల బాలయ్యకు.. అలాగే ‘ఆహా’కు గొప్ప ప్రయోజనమే చేకూరింది. తొలి సీజన్లో పది ఎపిసోడ్లకు పైగానే నడిచిన ఈ షోకు తెరపడుతున్నపుడు అందరూ చాలా ఫీలయ్యారు.. అప్పుడే అయిపోయిందా అని. ఐతే ఇంత సక్సెస్ అయిన షోకు ఎండ్ కార్డ్ పడిపోతుందని ఎవరూ అనుకోలేదు. అనుకున్నట్లే ఇప్పుడు ఈ షో తిరిగి రాబోతోంది.

‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ షోకు అతిథిా వచ్చిన బాలయ్యను సింగర్ శ్రీరామచంద్ర ‘అన్ స్టాపబుల్’ గురించి అడిగాడు. దానికాయన బదులిస్తూ.. ‘‘మధుర క్షణాలకు ముగింపు ఉండదు, కొనసాగింపే’’ అని బదులిచ్చారు. ఈ కామెంట్‌తోనే ఆహా వారు ‘అన్‌స్టాబపుల్-2’ గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అతి త్వరలోనే రెండో సీజన్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. తొలి సీజన్లో మహేష్ బాబు, రాజమౌళి, మోహన్ బాబు, రవితేజ, నాని, బ్రహ్మానందం.. ఇలా చాలామంది ప్రముఖులతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరి రెండో సీజన్లో బాలయ్యతో కలిసి హంగామా చేసే తారలెవరో చూడాలి.

This post was last modified on June 21, 2022 12:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

17 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

56 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago