Movie News

విక్రమ్ OTT డేట్ లాకయ్యిందా

ఓ మోస్తరు అంచనాలతో అడుగుపెట్టి బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరిస్తున్న విక్రమ్ తమిళంలో ఏకంగా బాహుబలి 2 రికార్డుని క్రాస్ చేసి ఆల్ టైం నెంబర్ వన్ పొజిషన్ వైపు దూసుకుపోతోంది. తెలుగులోనూ పెట్టుబడి మీద రెట్టింపు లాభాలు ఇచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉంది. అంటే సుందరానికి పూర్తిగా నెమ్మదించడం, విరాటపర్వం ఎలాంటి అంచనాలు నిలబెట్టుకోలేకపోవడం ఇలా చాలా రకాలుగా విక్రమ్ కు కలిసొస్తోంది. ఇప్పటికే షేర్ పదిహేను కోట్లు దాటేసింది.

ఇప్పుడు అందరి దృష్టి విక్రమ్ ఓటిటి ప్రీమియర్ ఎప్పుడు ఉంటుందనే దాని మీదే ఉంది. ముఖ్యంగా కమల్ ఫ్యాన్స్ తో పాటు యూత్ రిపీట్స్ లో చూసేందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం విక్రమ్ ని హాట్ స్టార్ లో జూలై 8న స్ట్రీమింగ్ చేయబోతున్నారని చెన్నై టాక్. అఫీషియల్ గా ఎక్కడ చెప్పలేదు కానీ ఈ లీక్డ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అప్పటికి ఇంకా నలభై రోజుల రన్ పూర్తయ్యి ఉండదు. అలాంటప్పుడు అంత త్వరగా విడుదల చేస్తారానే డౌట్ రావడం సహజం.

ముందస్తు ఒప్పందంలో అలా మాట్లాడుకున్నారని ఒకవేళ చివరి నిమిషంలో మార్పు ఉండొచ్చని కూడా అంటున్నారు. గతంలో అఖండకు ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు నిర్మాత రిక్వెస్ట్ మీద యాభై రోజుల తర్వాత ఓటిటిలో వేశారు. మరి విక్రమ్ కు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గత ఏడాది లోకేష్ కనగ రాజ్ గత సినిమా మాస్టర్ బాగా ఆడుతున్న టైంలోనే ఇరవై రోజుల తర్వాత ప్రైమ్ లో వదిలేశారు. మరి విక్రమ్ కూడా అదే రూట్ పడుతుందా లేక ఫిఫ్టీ డేస్ సూత్రాన్ని అనుసరిస్తుందా చూడాలి.

This post was last modified on June 21, 2022 12:01 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

13 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago