ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన వ్యవహారాలు, పరిష్కరిచాల్సిన సమస్యలు బోలెడున్నాయి. గడప గడపకు ప్రభుత్వం పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళ్తుంటే జనాలు ఎన్నో సమస్యలు ఏకరవు పెడుతున్నారు. అధికార పార్టీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఐతే జనాలు మొరపెట్టుకుంటున్న సమస్యల్ని వదిలేసి.. అవసరం లేని వ్యవహారాల్లో తలదూర్చి కొత్త సమస్యలు సృష్టించడం జగన్ సర్కారకు అలవాటుగా మారుతోందన్న ముందు నుంచి ఉన్న విమర్శ.
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ఈ కోవకే చెందుతుంది. సినిమా బిజినెస్ అనేది పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. సినిమా తీసేది ఒకరు. దాన్ని పంపిణీ చేసేది ఇంకొకరు. ప్రదర్శించేది మరొకరు. చూసేదేమో జనం. ఇందులో ఎక్కడా ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎక్కడైనా సమస్య తలెత్తి అది ప్రభుత్వం దృష్టికి వస్తే అప్పుడు దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ జగన్ సర్కారు మాత్రం గత ఏడాది పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను టార్గెట్ చేసే క్రమంలో అనూహ్యంగా టికెట్ల రేట్లు తగ్గించేసి ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ సమస్య నెలల తరబడి ఎలా నానిందో.. పేదల కోసం రేట్లు తగ్గించాం అని ఊదరగొట్టి చివరికి ఇండస్ట్రీ జనాల్ని బాగా ఏడిపించి, వాళ్లు తమ ముందు సాగిలపడ్డాక గతంలో ఉన్నదాని కంటే ఎలా రేట్లు పెంచి పడేశారో తెలిసిందే.
ఇలా లేని సమస్యను సృష్టించి.. తర్వాత దాన్నేదో పరిష్కరించేసినట్లు కలరింగ్ ఇవ్వడం జగన్ ప్రభుత్వానికే చెల్లింది. ఐతే అయ్యిందేదో అయ్యిందిలే అనుకుంటే.. ఇప్పుడు టికెట్ల బుకింగ్ వ్యవహారం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం చూస్తుండటం.. ఎగ్జిబిటర్ల మెడ మీద కత్తి పెట్టి దీనికి సంబంధించి ఎంవోయూ మీద సంతకాలు పెట్టించేందుకు ప్రయత్నిస్తుండటం వివాదాస్పదమవుతోంది.
ఇక నుంచి బుక్ మై షో, పేటీఎం లాంటి టికెటింగ్ యాప్స్ ఏవీ ఏపీ వరకు పని చేయవు. పూర్తిగా ప్రభుత్వం తీసుకురానున్న ఆన్ లైన్ టికెటింగ్ యాప్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందట. ఐతే ఇది ఏ సమస్యలు లేకుండా, పారదర్శకంగా జరిపితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ ఇందులో 2 శాతం ప్రభుత్వం కమీషన్ తీసుకోవడమే కాక.. టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే డబ్బులను ఏ రోజుకు ఆ రోజు ఎగ్జిబిటర్లకు జమ చేసే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమస్య తలెత్తుతోంది.
ఇప్పుడున్న టికెటింగ్ యాప్స్ అన్నీ ఏ రోజుకు ఆ రోజు టికెట్ల డబ్బులన్నీ ఎగ్జిబిటర్లకు ఇచ్చేస్తున్నాయి. కానీ జగన్ సర్కారు ఈ విషయంలో స్పష్టత ఇవ్వట్లేదు. బిల్లులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ పెట్టుకుని ఏడిపిస్తారేమో, లంచాలు ఇవ్వాల్సి వస్తుందేమో అని ఎగ్జిబిటర్లు టెన్షన్ పడుతున్నారు. అసలు ఇలా ప్రైవేటు బిజినెస్‌లో ప్రభుత్వ జోక్యం ఏంటి.. మాకు నచ్చిన మార్గంలో మేం టికెట్లు అమ్ముకుంటుంటే.. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఏంటి అని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. అసలు జగన్ సర్కారు ఇలా అవసరం లేని వ్యవహారాల్లో ఎందుకు కెలుక్కుని అందరినీ ఇబ్బంది పెడుతోంది, జనాల్లో చెడ్డపేరు తెచ్చుకుంటోంది అన్నదే అర్థం కాని విషయం.
This post was last modified on June 21, 2022 11:54 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…