గౌరవప్రదంగా విడాకులు తీసుకుని వ్యక్తిగత జీవితాలు గడుపుతున్న నాగ చైతన్య సమంతాలను గాసిప్ భూతాలు వదలడం లేదు. ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ ఏవేవో కథనాలతో ఆధారాలు లేకపోయినా సరే బురదజల్లే బ్యాచులు ఎక్కువైపోతున్నాయి. వీటిని పట్టించుకోకుండా ఎంత సంయమనం పాటిద్దామనుకున్నా సరే అదుపు చేసుకోవడం కష్టమైపోతోంది. అందులోనూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ లాంటి వాళ్ళు ఊరికే తమమీద వచ్చిన కామెంట్లకు సమాధానం చెప్పకుండా ఉండలేరు. ఇప్పుడదే జరిగింది.
చైతు వేరొకరితో ప్రేమలో ఉన్నాడని, గ్లామర్ వేషాలకు దూరంగా కేవలం పరిమితంగా నటించే ఆ అమ్మాయితో డీప్ లవ్ లో పడిపోయాడని, వీటిని సమంతా తరఫున పిఆర్ టీమే ప్రచారం చేయించిందని ఓ వెబ్ సైట్ లో ఏదేదో రాశారు. దీంతో సామ్ కు కోపం వచ్చింది. కాకపోతే ట్విట్టర్ లో దాన్ని రీ ట్వీట్ చేస్తూ అమ్మాయి మీద ఏదైనా పుకారు వస్తే అది నిజమే అనుకునేవాళ్లు, అదే అబ్బాయి మీద వస్తే మాత్రం అవతలి వాళ్ళ మీదకు సులభంగా తోసేస్తారని గట్టి చురక వేసింది. మీ జీవితాలు చూసుకోమని హితవు పలికింది.
నిజానికి సామ్ స్పందించకుండా సైలెంట్ గా ఉంటే ఇది కొన్ని వేల మందితో ఆగిపోయేది. కాని ఇప్పుడు తన అఫీషియల్ హ్యాండిల్ నుంచి రీ ట్వీట్ చేసి తప్పుని ఎత్తి చూపడంతో ఇప్పటిదాకా తెలియని వాళ్లకు కూడా ఉప్పందించినట్టు అయ్యింది. ఇలాంటి వాటిని ఖండించడం అవసరమే కానీ దాని వల్ల కలిగే ప్రయోజనం ఎంత మోతాదులో ఉంటుందో గుర్తించడం అవసరం. డైవోర్స్ అయ్యాక మునుపటి కంటే బిజీగా మారిన సమంతాకు ఇప్పుడు చేతి నిండా ఆఫర్లున్నాయి.
This post was last modified on June 21, 2022 11:48 am
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…