Movie News

వైష్ణవ్ తేజ్‌.. తగ్గేదేలే

టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది హీరోలు మరే కుటుంబం నుంచి రాలేదు. ఐతే వాళ్లలో మెజారిటీ సక్సెస్ కావడం, ఎక్కువగా బయటి బేనర్లలోనే అవకాశాలు సంపాదించడం, సొంత టాలెంట్‌తో నిలబడటం అభినందనీయం. ఆ ఫ్యామిలీ నుంచి చివరగా హీరోగా అరంగేట్రం చేసింది వైష్ణవ్ తేజ్.

అతను మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో ‘ఉప్పెన’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. తొలి సినిమాతో ఇంత పెద్ద హిట్ కొట్టాక కెరీర్‌కు ఢోకా ఏముంటుంది? రెండో సినిమాకే క్రిష్ లాంటి పెద్ద దర్శకుడితో ఆయన బేనర్లోనే నటించాడు వైష్ణవ్.

కానీ వీరి కలయికలో వచ్చిన ‘కొండపొలం’ అంచనాలను అందుకోలేకపోయింది. అయినా వైష్ణవ్ జోరేమీ తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్ యువ కథానాయకుల్లో అత్యంత బిజీగా ఉన్న వాళ్లలో వైష్ణవ్ ఒకడు. అతడికి వరుసగా పెద్ద పెద్ద బేనర్లలోనే అవకాశాలు వస్తున్నాయి.

వైష్ణవ్ మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’ను నిర్మిస్తున్నది శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని ఈ సంస్థ ‘ఛత్రపతి’, ‘అత్తారింటికి దారేది’ లాంటి భారీ చిత్రాలను నిర్మించడం తెలిసిందే. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈసారి అతను ‘భీమ్లా నాయక్’ ప్రొడ్యూసర్‌ సూర్యదేవర నాగవంశీతో జట్టు కడుతున్నాడు.

ఆయన బేనర్ సితార ఎంటర్టైన్మెంట్స్‌తో వైష్ణవ్ ఒకేసారి రెండు మూడు చిత్రాలకు ఒప్పందం చేసుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ముందుగా శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో వైష్ణవ్ తేజ్ సినిమాను మొదలుపెడుతున్నారు. బుధవారమే ఈ చిత్రానికి ప్రారంభోత్సవం కూడా జరగనుంది.

‘పెళ్ళిసంద-డి’తో టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన యువ కథానాయిక శ్రీ లీల ఈ చిత్రంలో వైష్ణవ్‌తో జోడీ కట్టబోతోంది. మొత్తానికి వైష్ణవ్ తేజ్ స్పీడైతే మామూలుగా లేదు. ఇలా ఒక కొత్త హీరో కెరీర్ ఆరంభంలో వరుసగా మైత్రీ, ఎస్వీసీసీ, సితార లాంటి పెద్ద బేనర్లలో సినిమాలు చేయడం విశేషమే.

This post was last modified on June 21, 2022 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సీఐడీ చేతికి పోసాని కేసు

వైసీపీ హయాంలో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి…

16 mins ago

సౌత్‌ హీరోల్లో ఉన్న ఐకమత్యం మాలో లేదు – అక్షయ్, అజయ్

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు.…

30 mins ago

మళ్ళీ బిగ్ బ్రేక్ ఇచ్చేసిన రాజమౌళి..

మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…

2 hours ago

ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ వైభవ్?

ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…

2 hours ago

మండ‌లిని ఇలా బ‌లోపేతం చేస్తున్నారు.. బాబు ఐడియా భేష్ ..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఐడియా వేస్తే.. తిరుగుండ‌దు. అది ఎన్నిక‌లైనా.. రాజ‌కీయాలైనా పాల‌న‌లో అయినా.. ఆయ‌న ఆలోచ‌న‌లు…

2 hours ago