ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో అడివి శేష్ ఒకడు. అతడికి ఫిలిం బ్యాగ్రౌండ్ లేకపోవచ్చు. తను పెద్ద స్టార్ కాకపోవచ్చు కానీ.. మంచి అభిరుచితో సినిమాలు చేయడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నటుడిగానే కాక రచయితగా కూడా అతడికి చాలా మంచి పేరొచ్చింది గత కొన్నేళ్లలో. పైగా అందగాడు కూడా కావడంతో అమ్మాయిలకు అతను ఫేవరెట్ అయిపోయాడు.
ఐతే పెళ్లీడు వచ్చి చాలా ఏళ్లయినా శేష్ అలాంటి ఆలోచనతోనే ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా పెళ్లి పట్ల తన వ్యతిరేకతను ఎప్పటికప్పుడు దాచుకోకుండా బయటపెట్టేస్తున్నాడు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శేష్.. ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాలు చెప్పాడు. తన జీవితంలో అమ్మాయిలు లేకుండా ఏమీ లేదని.. కానీ ఎవరితోనూ పెళ్లి వరకు అడుగులు వేయలేకపోయానని అతనన్నాడు.
యుఎస్‌లో ఉండగా ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించానని.. ఆ ఆమ్మాయి తనకు తర్వాత పెద్ద షాకే ఇచ్చిందని శేష్ వెల్లడించాడు. కొన్ని కారణాల వల్ల తనతో బ్రేకప్ కాగా.. తన పుట్టిన రోజే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయి పెద్ద షాకిచ్చిందని శేష్ తెలిపాడు. ఆ తర్వాత కూడా తన జీవితంలోకి కొందరు అమ్మాయిలు వచ్చారని.. వేర్వేరు సమయాల్లో వేర్వేరు అమ్మాయిలతో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని.. కానీ ఎవ్వరితోనూ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం చేయలేకపోయానని శేష్ అన్నాడు.
ఇంట్లో వాళ్లు తన పెళ్లి గురించి అడిగి అడిగి విసిగిపోయారని.. ఇప్పటికైతే తన దృష్టంతా సినిమాల మీదే ఉందని, సినిమాతోనే ప్రేమలో ఉన్నానని శేష్ తెలిపాడు. ప్రస్తుతం తన చెల్లెలి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నానని.. తన పెళ్లి గురించైతే ఆలోచించట్లేదని అతనన్నాడు. శేష్ లేటెస్ట్ మూవీ మేజర్ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.
This post was last modified on June 20, 2022 9:26 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…