నిన్నటి తరం సీనియర్ హీరోలు క్యారెక్టర్, విలన్ రోల్స్‌లోకి మారడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు హీరోలుగా వైభవం చూసిన జగపతిబాబు, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్.. ఇలా చాలామంది ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న వాళ్లే. ఈ జాబితాలో చేరకుండా, ఇప్పటికీ హీరోగా ట్రై చేస్తూ ఎదురు దెబ్బలు తింటూనే ఉన్నాడు రాజశేఖర్. తాజాగా ఆయనకు ‘శేఖర్’ సినిమా చేదు అనుభవం మిగిల్చింది. ఈ సినిమాను ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు.
గత పది పదిహేనేళ్లలో ‘గరుడవేగ’ మినహాయిస్తే రాజశేఖర్‌కు సక్సెసే లేదు. ఇప్పుడు మారిన పరిస్థితులు, ప్రేక్షకుల అభిరుచి ప్రకారం చూస్తే రాజశేఖర్ సినిమా చాలా బాగుందన్నా కూడా ఆడుతుందన్న గ్యారెంటీ లేదు. ఇది రాజశేఖర్ అర్థం చేసుకోవాల్సిన చేదు నిజం. ఆయన స్థాయికి జగపతిబాబు లాగా క్యారెక్టర్, విలన్ రోల్స్‌లోకి మారితే మంచి ఫలితం ఉంటుందన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. రాజశేఖర్ మాత్రం తాను ఈ టైపు రోల్స్ చేయాలంటే తన పాత్ర ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పుకుంటూ ఆగిపోతున్నారు.
ఐతే ఎట్టకేలకు రాజశేఖర్ ఒక పెద్ద సినిమాలో విలన్ పాత్రకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నందమూరి బాలకృష్ణ సినిమాలో ప్రతినాయకుడిగా నటించనున్నాడట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సిినమా చేస్తున్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య నడి వయస్కుడిగా కనిపిస్తాడని, ఆయన కూతురిగా శ్రీలీల నటిస్తుందని అనిల్ ఇప్పటికే వెల్లడించాడు. తాజా సమాచారం ప్రకారం ఇందులో విలన్‌గా రాజశేఖర్ నటించనున్నాడట. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాలయ్య సినిమా ‘లెజెండ్’తో విలన్ పాత్రలోకి మారిన జగపతిబాబు ఎంత పేరు సంపాదించాడో, ఎలా బిజీ అయ్యాడో తెలిసిందే. ఈ మద్య ‘అఖండ’లో శ్రీకాంత్ కూడా విలన్‌గా మెరిశాడు. అతడికీ బాలయ్య కలిసొచ్చాడు. ఇలాగే రాజశేఖర్‌కు కూడా బాలయ్య సెంటిమెంట్ ప్లస్ అయి విలన్, క్యారెక్టర్ రోల్స్‌లో బిజీ అవుతాడేమో చూడాలి.
This post was last modified on June 20, 2022 12:43 pm
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…
అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…
దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్‌లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…