ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎంతమంచివాడవురా’ సినిమాతో పలకరించాడు నందమూరి కళ్యాణ్ రామ్. అసలే అతడి కెరీర్ అంతంతమాత్రంగా సాగుతుంటే.. ఈ సినిమా మరీ దారుణమైన ఫలితాన్నందించి కెరీర్‌ను మరింతగా దెబ్బ తీసింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఇదొకటని చెప్పొచ్చు.
ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ బ్రేక్ తీసుకున్నాడు. కొత్త సినిమా ఏదీ ఖరారు చేయలేదు. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా అన్నారు కానీ.. దాని సంగతి ఏమీ తేలలేదు. ఐతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ తనలాగే జనవరి నెలలో పెద్ద డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో పని చేయబోతుండటం విశేషం. ఆ దర్శకుడు మరెవరోకాదు.. వీఐ ఆనంద్. అతడి చివరి సినిమా ‘డిస్కో రాజా’.. సంక్రాంతి తర్వాత రిలీజై దారుణమైన ఫలితాన్నందుకుంది.
కొన్నేళ్ల కిందట ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో భారీ విజయాన్నందుకున్నాడు ఆనంద్. ఆ తర్వాత తీసిన ‘ఒక్కక్షణం’, ‘డిస్కో రాజా’ కూడా భిన్నమైన కథలతో తెరకెక్కినవే. కానీ వాటి ఎగ్జిక్యూషన్ సరిగా లేక బోల్తా కొట్టాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కోసం మరో భిన్నమైన కథనే రెడీ చేశాడట ఆనంద్. కమర్షియల్‌గా కూడా వర్కవుటయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని.. ఇద్దరూ కలిసి ఓ మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారట.
ఈ చిత్రానికి నిర్మాత ఎవరో ఇంకా వెల్లడి కాలేదు. వేరే ప్రొడ్యూసర్ దొరక్కపోతే కళ్యాణ్ రామే నిర్మించే అవకాశముంది. మరోవైపు కళ్యాణ్ రామ్.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే కొత్త చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంటే ముందే ఆనంద్ దర్శకత్వంలో తన సినిమాను కళ్యాణ్ రామ్ మొదలుపెట్టే అవకాశముంది.
This post was last modified on June 28, 2020 9:38 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…