Movie News

జగనే కరెక్ట్.. మేమంతా జోకర్లం

సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఎడతెగని చర్చ జరుగుతోంది టాలీవుడ్లో. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు అసాధారణ రీతిలో టికెట్ల రేట్లు తగ్గించేయడంతో మొదలైంది ఈ చర్చ. చిన్న సెంటర్ల పేరు చెప్పి రేట్లను మరీ తగ్గించేయడం, థియేటర్ల మెయింటైనెన్స్ కూడా కష్టమయ్యే పరిస్థితి రావడంతో ఈ పరిణామాలపై సినీ జనాలు గగ్గోలు పెట్టారు. ఎడతెగని చర్చలు, సంప్రదింపుల తర్వాత ఏపీలో రేట్లు పెరిగాయి.

అంతకంటే ముందు తెలంగాణలో సాధారణ స్థాయిలో ఉన్న ధరలను విపరీంగా పెంచి పడేశారు. ఇప్పుడు పెరిగిన రేట్లు గుదిబండలా మారాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు. దీంతో నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలకు రేట్లు తగ్గించడం తెలిసిందే. ఈ పరిణామాలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టికెట్ల రేట్ల విషయంలో టాలీవుడ్ తప్పు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీలో టికెట్ల ధరల పెంపు కోసం అప్పటి మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపిన వాళ్లలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. రేట్లు పెంచాలని ఆయన కూడా గట్టిగా వాయిస్ వినిపించారు. మరి ఇప్పుడు టికెట్ల ధరలు పెరగడం సమస్యగా మారడంపై వర్మ స్పందిస్తూ.. “జనాలు ఎక్కువ రేట్లను భరించలేరని ఏపీ సీఎం జగన్ రేట్లు తగ్గించారు. కానీ మేం మాత్రం ఎక్కువ రేట్లుండాల్సిందే అని పట్టుబట్టాం. నేను కూడా గట్టిగా మాట్లాడాను. కానీ ఇప్పుడు రేట్లు పెరగడం వల్ల జనాలు థియేటర్లకు రావట్లేదు. ఇది గమనించి నిర్మాతలు తమ సినిమాలకు ధరలు తగ్గించుకుంటున్నారు. రేట్ల పెంపు కోసం మేం చేసింది తప్పు కాదు. పెద్ద బ్లండర్. ఈ విషయంలో జగనే కరెక్ట్. మేమంతా జోకర్లయిపోయాం” అని వర్మ అన్నాడు.

ఐతే ఏపీలో తలెత్తిన సమస్యకు వర్మ మాట్లాడిందానికి సంబంధం లేదు. అక్కడ గత ఏడాది చిన్న సెంటర్ల పేరు చెప్పీ మరీ రేట్లు తగ్గించడమే సమస్యగా మారింది. ఇప్పుడు కూడా తలనొప్పిగా, ప్రేక్షకులకు అభ్యంతరకరంగా మారింది తెలంగాణ రేట్లే.

This post was last modified on June 20, 2022 12:37 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

35 mins ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

38 mins ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

2 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

2 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

3 hours ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

3 hours ago