Movie News

సురేష్ బాబు.. తప్పు చేశాడా?

ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్లలో సురేష్ బాబు ఒకరు. సినిమాల నిర్మాణం, పంపిణీ, రిలీజ్ విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుంది. కథల ఎంపిక దగ్గర్నుంచి సినిమాల ఫలితం వరకు ఆయనకు మంచి జడ్జిమెంట్ ఉందని అంతా చెప్పుకుంటారు.

ఈ రోజుల్లో నిర్మాణం చాలా రిస్కీగా మారిన నేపథ్యంలో పెద్ద బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లకుండా.. చాలా వరకు చిన్న, మీడియం రేంజ్ సినిమాల్లో భాగస్వామి అవుతుండటం, అందులోనూ పూర్తిగా పెట్టుబడి పెట్టకుండా, కొంత మేరే వాటా తీసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతుండటం గమనించవచ్చు.

‘విరాటపర్వం’ విషయంలోనూ ఆయన అలాగే చేశారు. ఈ సినిమాకు ఆయన సమర్పకుడు మాత్రమే. ఖర్చంతా పెట్టుకుంది సుధాకర్ చెరుకూరినే. ఐతే బిజినెస్ మొత్తం సురేష్ బాబు చేతుల మీదుగానే జరిగింది. ఐతే కరోనాకు ముందు మొదలైన ‘విరాటపర్వం’ రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం తెలిసిందే.

దీంతో పాటే సురేష్ బాబు వెంకటేష్‌తో తీసిన నారప్ప, దృశ్యం-2 చిత్రాలను తీవ్ర వ్యతిరేకత మధ్య థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేయడం తెలిసిందే. ఆ రెండు చిత్రాలను మంచి లాభానికే ఓటీటీలకు ఇచ్చారు సురేష్ బాబు. ఒక దశలో ‘విరాటపర్వం’ సినిమాకు కూడా ఓటీటీ డీల్ పూర్తయిందని, థియేట్రికల్ రిలీజ్ ఉండదని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గట్టిగా ప్రమోట్ చేసి ఈ శుక్రవారం విడుదల చేశారు. సినిమాకు చాలా వరకు పాజిటివ్ టాకే వచ్చింది. కానీ ఇది నెమ్మదిగా సాగే సీరియస్ మూవీ, పైగా విషాదాంతం కావడంతో ఎక్కువగా వినోదం కోసమే థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులు దీన్ని అనుకున్నంత స్థాయిలో ఆదరించట్లేదు.

తొలి వీకెండ్లోనే కలెక్షన్లు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఆదివారం కొంత వరకు సినిమా హోల్డ్ చేయొచ్చు కానీ.. వీకెండ్ తర్వాత నిలబడ్డం చాలా కష్టంగా ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ నంబర్స్ చూస్తుంటే.. థియేట్రికల్ రిలీజ్ ఎందుకు చేశారు, దీని బదులు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే మంచి లాభాలు వచ్చి ఉండేవి కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో సురేష్ బాబు తప్పటడుగు వేశాడని అంటున్నారంతా.

This post was last modified on June 20, 2022 8:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

AI వాడి కరెంట్ బిల్లు తగ్గిస్తారా?

పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…

2 minutes ago

‘అఖండ’మైన నిర్ణయం తీసుకునే టైమొచ్చింది

అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…

25 minutes ago

ఇండిగో: టికెట్ డబ్బులిస్తే సరిపోతుందా?

దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్‌లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…

51 minutes ago

అవ‌తార్-3… అంత సీనుందా?

2009లో అవ‌తార్ సినిమా రిలీజైన‌పుడు వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్ప‌టిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…

3 hours ago

ఇంట‌ర్వ్యూలో క‌న్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్

ఉప్పెన సినిమా చేసే స‌మ‌యానికి కృతి శెట్టి వ‌య‌సు కేవ‌లం 17 ఏళ్లే. అంత చిన్న వ‌య‌సులోనే ఆమె భారీ…

3 hours ago

అప్పు చేయడం తప్పు కాదా?

ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…

6 hours ago