హీరోగా తొలి విజయం కోసం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన అక్కినేని అఖిల్.. చివరికి గత ఏడాది దసరా సందర్భంగా ఆకలి తీర్చుకున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను పరాజయాల తర్వాత అతను నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డివైడ్ టాక్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బాగానే నిలబడింది.
అఖిల్ ఖాతాలో తొలి విజయాన్ని జమ చేసింది. మొత్తానికి అఖిల్ మీద భారం దిగిపోయింది. ఇప్పుడిక అతను మాస్ ఇమేజ్ సంపాదించే పనిలో పడ్డాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అతను ఏజెంట్ అనే భారీ యాక్షన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
అఖిల్ ట్రాక్ రికార్డు, మార్కెట్ గురించి పట్టించుకోకుండా నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ముంబయి భామ సాక్షి వైద్య కథానాయికగా నటించనున్నట్లు ఇంతకుముందే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆమె ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం ద్వారా తనే కథానాయిక అని ధ్రువీకరించింది చిత్ర బృందం. ఆదివారం సాక్షి పుట్టిన రోజు. ఈ సందర్భంగా చలాకీగా ఉన్న ఆమె ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. అందం, షార్ప్ లుక్స్ ఉన్న సాక్షి అఖిల్ పక్కన బాగానే సూటయ్యేలా కనిపిస్తోంది. ఆమెకు తెలుగులోనే కాదు.. కెరీర్లో మొత్తంగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం.
మోడల్‌గా సాక్షి వైద్యకు మంచి పేరే ఉంది. టీవీఎస్ ఎక్స్ఎల్ సహా కొన్ని యాడ్స్‌తో ఆమె పాపులర్ అయింది. ఏజెంట్ చిత్రీకరణ ప్రస్తుతం జోరుగానే సాగుతోంది. ముందు ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా ఆలస్యమయ్యేలా ఉందని, ఆ తేదీకి రాకపోవచ్చని అంటున్నారు. చిత్ర బృందం ఈ విషయంలో ఏమీ స్పందించలేదు.
This post was last modified on June 20, 2022 7:59 am
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…