ఈ మధ్య వచ్చిన సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు చూస్తుంటే అంతుచిక్కని విషయాలు బయటపడుతున్నాయి. అంటే సుందరానికి అందరూ బాగానే ఉందన్నారు. తీరా చూస్తే ఇంకా బ్రేక్ ఈవెన్ కి చెప్పుకోదగ్గ దూరంలోనే ఉంది. మూడో వారంలో ఏదైనా అద్భుతం జరగడానికి ఇది శంకరాభరణం కాలం కాదు.
మొన్న వచ్చిన విరాట పర్వంని క్రిటిక్స్ మనస్పూర్తిగా మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ పొగడ్తలు కనిపించాయి. కానీ థియేటర్ల వద్ద సగం జనం కూడా లేరు. వీకెండ్ ఇలా అయితే ఇక రేపటి నుంచి ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చు. సర్కారు వారి పాట మహేష్ ఇమేజ్ వల్ల నష్టాలు తగ్గించుకుంది కానీ బ్లాక్ బస్టర్ కాలేకపోయింది.
ఎఫ్3 ఆదరణ బాగానే ఉంది కానీ ఎఫ్2 స్థాయి దూకుడు చూపించలేదన్నది వాస్తవం. అపోజిషన్ వీక్ గా ఉండి ప్రయోజనం ఎక్కువ కలిగింది. లేదంటే దీని పరిస్థితి కూడా ఇబ్బందే. ఈ పరిణామాలు గమనిస్తే ప్రేక్షకులు మారారా లేక దర్శకులు అప్ డేట్ కావడం లేదానే అనుమానం కలగడం సహజం.
కాకపోతే కరోనా తర్వాత ఆడియన్స్ అభిరుచుల్లో ప్రాక్టికల్ గా వచ్చిన మార్పులను ఇండస్ట్రీ పసిగట్టలేకపోవడం వల్ల వచ్చిన చిక్కే ఇది. కేవలం ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2లే ఈ పరిస్థితి కారణం కాదు. పెరిగిన టికెట్ రేట్లు, ఓటిటిలో అంతకంతా పెరుగుతున్న క్వాలిటీ కంటెంట్ వల్ల సినిమా హాల్ కు రావాలంటే పబ్లిక్ బలమైన కారణం కోరుతున్నారు.
దానికి తగ్గట్టే ఇకపై దర్శకులు రచయితలు సిద్ధపడాల్సి ఉంటుంది. అంతే తప్ప హీరో మెచ్చాడనో పర్సనల్ గా డైరెక్టర్ కు ఫలానా భావజాలం ఇష్టమనో సినిమాలు తీస్తే పైన చెప్పిన సీన్ రిపీట్ అవ్వడం ఖాయం.
విక్రమ్ మనవాళ్ళు కూడా ఎందుకు ఎగబడి చూశారో విశ్లేషించుకోవడం చాలా అవసరం. వచ్చే గురు శుక్రవారాల్లో ఏకంగా తొమ్మిది సినిమాలు వస్తున్నాయి. కానీ ట్రేడ్ లో ఉండాల్సిన జోష్ కనిపించడం లేదు. జురాసిక్ పార్క్ లు, థోర్ లు నెల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ పెడితే టికెట్లు కొంటున్న జనంలో మన సినిమాల పట్ల ఎందుకు ఆసక్తి సన్నగిల్లుతోందో సీరియస్ గా ఆలోచించాలి. లేదంటే పరిణామాలు ఇంకా తీవ్రంగా మారే ప్రమాదం లేకపోలేదు.
This post was last modified on June 19, 2022 2:40 pm
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం…
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…