ఒకప్పుడు తెలుగులోనే కాదు ఇండియా వైడ్ పాపులారిటీలో శ్రీదేవిని మించినవారు లేరు. ఏఎన్ఆర్ తో స్టెప్పులు వేయాలన్నా వాళ్ళబ్బాయి నాగార్జునతో ఆడిపాడాలన్నా ఆమెకే చెల్లింది. చిరంజీవి అంతటి మెగాస్టార్ కే అతిలోకసుందరి జోడిగా నటించడానికి పదేళ్లు పట్టింది. ఇక హిందీ గురించి చెప్పుకుంటూ పోతే పుస్తకమే అవుతుంది. కోట్లాది అభిమానులను సొంతం చేసుకుని వాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ మీద మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. ఫ్యాన్స్ జూనియర్ శ్రీదేవిగా పిలుచుకున్నారు.
కానీ తీరా ఆ అమ్మాయి కెరీర్ ప్లానింగ్ చూస్తుంటే స్క్రీన్ కంటే ఓటిటిలో ఎక్కువ కనిపించేలా ఉంది. 2108 ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ ఐదేళ్లలో చేసిన సినిమాలు చాలా తక్కువ. వాటిలో గుంజన్ సక్సేనా, ఘోస్ట్ స్టోరీస్ డైరెక్ట్ డిజిటల్ లో వచ్చేశాయి. నయనతార కోకో కోకిల రీమేక్ గుడ్ లక్ జెర్రీ కూడా థియేటర్లకు వెళ్లే సాహసం చేయలేకపోయింది. మరో మళయాలం మూవీ హెలెన్ ని జాన్వీ మిలిగా చేసింది. ఇది ఎందులో వస్తుందో ఇంకా తెలియదు. ఎప్పుడో నవంబర్ లో పూర్తి చేస్తే ఇప్పటిదాకా రిలీజ్ అప్డేట్ లేదు.
ఇవి కాకుండా చేతిలో ఉన్న రెండు సినిమాలు మిస్టర్ అండ్ మిసెస్ మహీ, బవాల్. అంతే. నిజానికి గతంలో తనకు టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వెళ్లాయి. దిల్ రాజు, పూరి లాంటి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. కానీ తండ్రి బోనీ కపూర్ ఏదేదో అంచనా వేసుకుని ఇక్కడ లాంచ్ చేయడం వాయిదా వేసుకుంటూ వచ్చారు. కట్ చేస్తే ఇప్పుడామె మీద మనోళ్లకు ఆసక్తి తగ్గిపోయింది. అక్కడ చూస్తేనేమో అధిక శాతం రీమేకులు, ఓటిటి రిలీజులతో ప్లానింగ్ ఎగుడుదిగుడుగా మారింది. చూస్తుంటే శ్రీదేవి వారసత్వం నిలబెట్టడం కష్టమే అనిపిస్తోంది
This post was last modified on June 19, 2022 12:56 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…