వసూళ్ల లెక్కలో కెజిఎఫ్ 2 మన ఆర్ఆర్ఆర్ ని దాటిందన్నది వాస్తవమే. తేడా వంద కోట్లే అయినప్పటికీ రాజమౌళి మూవీని మూడో సినిమాకే ప్రశాంత్ నీల్ దాటేయడం విశేషమే. అయితే ఇలా లెక్కల్లో కెజిఎఫ్ గెలిచిన మాట నిజమే కానీ అంతర్జాతీయ గుర్తింపులో మాత్రం ట్రిపులార్ ని కనీసం టచ్ కూడా చేయలేకపోయింది.
ఇండియా, ఓవర్సీస్ లో థియేట్రికల్ రన్ పూర్తయ్యాక యుఎస్ లో ఎన్కోర్ పేరుతో ఆర్ఆర్ఆర్ ని రీ రిలీజ్ చేసి ప్రీమియర్లు వేస్తే దాదాపు అన్ని స్క్రీన్లు హౌస్ ఫుల్ బోర్డ్స్, నాన్ ఇండియన్స్ తో కళకళలడాయి.
అక్కడితో కథ అయిపోలేదు. రాటెన్ టొమాటోస్ లో రిజిస్టర్ అయిన తొలి సౌత్ మూవీగా మరో ఘనత అందుకుంది. హాలీవుడ్ సినిమాలు, ఇంటర్నేషనల్ గేమ్స్, స్పోర్ట్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు రోజు ట్వీట్లు వేసి మరీ ఈ విజువల్ గ్రాండియర్ ని చూసిన ఆనందాన్ని పంచుకుంటున్నారు.
వీళ్లంతా స్వచ్చందంగా హిందీ వెర్షన్ ని సబ్ టైటిల్స్ సహాయంతో చూసినవాళ్ళే. 1 మిలియన్ ఫాలోయర్లు ఉన్న సుప్రసిద్ధ గేమ్ డిజైనర్ కొజిమా హిడియో ఆర్ఆర్ఆర్ గురించి ట్వీట్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది
చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి కానీ కెజిఎఫ్ 2కి ఇలాంటి గుర్తింపు ఓటిటిలో వచ్చాక రాలేదన్నది వాస్తవం. అమెజాన్ ప్రైమ్ ఎంత ప్రమోషన్ చేస్తున్నా అది ఇండియా వరకే పరిమితమవుతోంది.
ఆర్ఆర్ఆర్ తో పోల్చుకుంటే కెజిఎఫ్ 2లో ఉన్న హీరోయిజం ఎలివేషన్లు ఎక్కువే అయినప్పటికీ విదేశీయులకు అది కనెక్ట్ కావడం లేదు. జక్కన్న మాయాజాలం ముందు ఇంకేదీ ఎక్కడం లేదు. మొత్తంగా చూస్తే వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ లో కెజిఎఫ్ 2 మీద ఆర్ఆర్ఆర్ పూర్తిగా పైచేయి సాధించిన మాట వాస్తవం.
This post was last modified on June 18, 2022 8:54 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…