సాధారణంగా హీరోయిన్లు గ్లామర్‌తోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదిస్తుంటారు. కేవలం వారి నటనకు ముగ్ధులై అభిమానులుగా మారే వాళ్లు తక్కువగా ఉంటారు. హీరోయిన్ల నటన చూడటానికి థియేటర్లకు రావడం కూడా చాలా తక్కువమందిలోనే జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు సౌందర్య ఇలాంటి ఇమేజ్‌తోనే తిరుగులేని స్థాయిని అందుకుంది. ఆమె మిగతా హీరోయిన్లలా అందాల విందు చేయలేదన్న మాటే కానీ.. అందం విషయంలో తన ఆకర్షణే వేరు.
తర్వాతి తరంలో త్రిష, నయనతార, అనుష్క, సమంత లాంటి హీరోయిన్లు ఇటు అందం, అటు అభినయంతో ఆకట్టుకున్నారు. అభిమాన గణాన్ని పెంచుకున్నారు. కానీ వీరితో పోలిస్తే సాయిపల్లవి భిన్నమే. ఆమెను ఎవ్వరూ ఎప్పుడూ గ్లామర్ కోణంలో చూడలేదు. కేవలం తన నటనకే ఫిదా అయ్యారు. కేవలం తన నట కౌశలంతోనే పైన చెప్పుకున్న హీరోయిన్లకు దీటుగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకోవడం సాయిపల్లవికే చెల్లింది.
మలయాళ ‘ప్రేమమ్’తో కొంతమేర తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయిపల్లవి.. ‘ఫిదా’తో లక్షల మందిని ఫిదా చేసింది. ఆ తర్వాత కూడా సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆమె ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ‘విరాటపర్వం’ సినిమాకు విడుదల ముంగిట కొంచెం హైప్ వచ్చిందంటే అది సాయిపల్లవికున్న క్రేజ్ వల్లే. కేవలం ఆమె నటన చూడ్డానికే తొలి రోజు లక్షల మంది థియేటర్లకు వచ్చారు. సినిమా ఓవరాల్‌కు మిశ్రమానుభూతి కలిగించినప్పటికీ.. సాయిపల్లవి కోసం వచ్చిన వాళ్లకైతే ఎలాంటి నిరాశ లేదు. అసలీ సినిమా కథ నడిచేదే సాయిపల్లవి పాత్ర చుట్టూ.
రానా సహా అందరినీ పక్కకు నెట్టేసి ప్రతి ఫ్రేమ్‌లోనూ హైలైట్ అవుతూ, తన నటనతో కట్టిపడేస్తూ అభిమానులను మురిపించింది సాయిపల్లవి. సినిమాలో చాలానే క్లోజప్ షాట్లు ఉన్నాయి. వాటిలో ఆమె ఇచ్చిన హావభావాల గురించి ఎంత పొగిడినా తక్కువే. ఎమోషనల్ సీన్లలో కన్నీళ్లు పెట్టించేసింది. నందితాదాస్ లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటితో కాంబినేషన్ సీన్లు చూస్తే సాయిపల్లవి ఎంత గొప్ప నటో అర్థమవుతుంది. ‘విరాటపర్వం’ సినిమాకు అంతిమంగా ఎలాంటి ఫలితం వస్తుందో కానీ.. సాయిపల్లవి కెరీర్లో మాత్రం వెన్నెల పాత్ర ఒక మైలురాయిలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on June 18, 2022 12:33 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…