ఖిలాడీ తర్వాత విడుదల కావాల్సిన మాస్ మహారాజా కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ ఆ మధ్య అఫీషియల్ గా వాయిదా వేసి కొత్త డేట్ ప్రకటిస్తామని చెప్పారు. అనౌన్స్ మెంట్ వచ్చి నెలవుతోంది. లేదంటే ఇవాళ విరాటపర్వం స్థానంలో ఈ మూవీ ఉండేది. సరే పోస్ట్ పోన్లు కరోనా వచ్చి పోయినప్పటి నుంచి సహజమే కదాని అభిమానులు సర్దిచెప్పుకున్నారు. టీజర్ వచ్చి నెలలు దాటుతోంది. కొన్ని పోస్టర్లు వదిలారు. హంగామా బాగానే చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా గప్ చుప్. రామారావు ఏ సౌండ్ చేయడం లేదు.
దర్శకుడు శరత్ మండవ కానీ నిర్మాతలు కానీ సోషల్ మీడియాలో అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో రూపొందుతున్న ధమాకా షూటింగ్ పూర్తి కావడానికి దగ్గరగా ఉంది. స్టువర్ట్ పురం దొంగల బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇటీవలే ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగి రవితేజ మోకాలికి పదికి పైగా కుట్లు పడ్డాయట. మరీ సీరియస్ గా కాకపోవడంతో వీలైనంత త్వరలోనే రీ స్టార్ట్ చేయబోతున్నట్టు యూనిట్ అప్ డేట్.
ఇవయ్యాక రావణాసుర ఉంటుంది. దీనికన్నా ముందు మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేస్తున్న వాల్తేర్ వీరయ్యని ఫినిష్ చేయాలి. వీటి గురించి ఇంత అలెర్ట్ గా అప్ టు డేట్ క్లియర్ గా తెలుస్తున్నప్పుడు రామారావు ఆన్ డ్యూటీ మాత్రం చప్పుడు చేయకపోవడం విచిత్రం. ఏవో ఆర్థిక లావాదేవీల కారణంగా ఇంకో పాట బ్యాలన్స్ ఉండగానే ఆపేశారని, తిరిగి మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తారో తెలియదని ఆఫ్ ది రికార్డు టాక్. రవితేజ వరస సినిమాలు వస్తున్నాయని ఆనందపడుతున్న టైంలో ఈ స్పీడ్ బ్రేకర్లు ఏంటని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు
This post was last modified on June 17, 2022 6:13 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…