Prabhas
‘బాహుబలి’ తర్వాత ఆకాశాన్నంటే అంచనాలను ప్రభాస్ అందుకోలేకపోయాడు. తన తర్వాతి చిత్రాలు ‘సాహో’, ‘రాధేశ్యామ్’లతో తీవ్రంగా నిరాశ పరిచాడు. ‘సాహో’ అయినా యాక్షన్ ఘట్టాలతో, కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంది, ఓపెనింగ్స్ అయినా తెచ్చుకుంది కానీ.. ‘రాధేశ్యామ్’ అయితే అన్ని రకాలుగా నిరాశ పరిచింది.
ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా డల్లయిపోయారు. అతడి తర్వాతి చిత్రాల మీద వాళ్లు భారీ ఆశలతో ఉన్నారు. ప్రభాస్ నుంచి సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, స్పిరిట్ లాంటి భారీ చిత్రాలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రాలకు తోడుగా.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ ఎంటర్టైనర్ చేయబోతున్న విషయం విదితమే. ఐతే చిన్న-మీడియం రేంజిలో మామూలు ఎంటర్టైనర్లు తీసే మారుతి.. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ భారీ సినిమా తీయగలడా అన్న సందేహాలున్నాయి.
అసలు మారుతి ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు.. జానర్ ఏంటి.. వీరి కలయికలో సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో అభిమానులు ఉత్కంఠకు గురవుతున్నారు. ఐతే పూర్తి వివరాలు చెప్పలేదు కానీ.. తన కొత్త చిత్రం ‘పక్కా కమర్షియల్’ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ సినిమా గురించి కొన్ని హింట్స్ అయితే ఇచ్చాడు మారుతి. ప్రభాస్‌కు తాను పెద్ద అభిమానినని.. ఒక అభిమానిగా ప్రభాస్ నుంచి అందరూ ఏం ఆశిస్తారో తనకు తెలుసని మారుతి వ్యాఖ్యానించాడు.
ప్రభాస్‌తో బుజ్జిగాడు, డార్లింగ్ లాంటి ఎంటర్టైనర్ తీయాలన్నది తన ఉద్దేశమని.. అలాంటి కథతోనే ప్రభాస్‌ను అప్రోచ్ అయ్యానని.. ఇంతకుమించి ఇప్పుడే ఆ సినిమా గురించి తాను ఎక్కువ మాట్లాడలేనని ప్రభాస్ స్పష్టం చేశాడు. ఏదైనా సరే.. అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే సినిమా ఉంటుందని, ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని మాత్రం మారుతి సంకేతాలిచ్చాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on June 17, 2022 2:16 pm
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…
యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…