హ్యాపీడేస్ సినిమాతో పుష్కరం కిందటే రూ.30 కోట్ల షేర్ రాబట్టిన దర్శకుడు శేఖర్ కమ్ముల. మూడేళ్ల కిందట వచ్చిన అతడి సినిమా ఫిదా రూ.50 కోట్ల దాకా షేర్ కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. తీసేవి క్లాస్ సినిమాలే అయినా.. మాస్ సినిమాలకు దీటుగా వసూళ్ల తెప్పించగల సత్తా శేఖర్ సొంతం. అయితే ఇంత స్టామినా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పెద్ద స్టార్లు ఎవ్వరితోనూ సినిమాలు తీయలేదు.
స్టార్లను డైరెక్ట్ చేయగల సత్తా ఉందని చెప్పడమే తప్ప.. వాళ్లతో సినిమాలు మాత్రం సెట్ చేసుకోలేకపోయాడు శేఖర్. ఒకప్పుడు మహేష్ బాబుతో సినిమా కోసం శేఖర్ ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. కానీ దాని సంగతేమైందో తెలియదు. ఐతే ఎట్టకేలకు శేఖర్.. ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు.. విక్టరీ వెంకటేష్.
ఫిదా తర్వాత కమ్ముల కొంచెం గ్యాప్ తీసుకుని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకుంటే ఈ పాటికి ఆచిత్రం విడుదలకు సిద్ధమయ్యేది. ఈ ప్రభావం వల్ల ఆ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇంకా కొంత చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఐతే లాక్ డౌన్ టైంను వృథా చేయకుండా తన కొత్త చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడట కమ్ముల. అది వెంకీతోనే అని సమాచారం. లవ్ స్టోరి చిత్రాన్ని నిర్మించిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్‌తో కలిసి పి.రామ్‌మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రానుందని.. వచ్చే ఏడాది ఇది పట్టాలెక్కుతుందని అంటున్నారు.
This post was last modified on June 27, 2020 11:33 pm
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…