‘బాహుబలి’ తర్వాత ఆకాశాన్నంటే అంచనాలను ప్రభాస్ అందుకోలేకపోయాడు. తన తర్వాతి చిత్రాలు ‘సాహో’, ‘రాధేశ్యామ్’లతో తీవ్రంగా నిరాశ పరిచాడు. ‘సాహో’ అయినా యాక్షన్ ఘట్టాలతో, కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంది, ఓపెనింగ్స్ అయినా తెచ్చుకుంది కానీ.. ‘రాధేశ్యామ్’ అయితే అన్ని రకాలుగా నిరాశ పరిచింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా డల్లయిపోయారు.
అతడి తర్వాతి చిత్రాల మీద వాళ్లు భారీ ఆశలతో ఉన్నారు. ప్రభాస్ నుంచి సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, స్పిరిట్ లాంటి భారీ చిత్రాలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రాలకు తోడుగా.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ ఎంటర్టైనర్ చేయబోతున్న విషయం విదితమే. ఐతే చిన్న-మీడియం రేంజిలో మామూలు ఎంటర్టైనర్లు తీసే మారుతి.. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ భారీ సినిమా తీయగలడా అన్న సందేహాలున్నాయి.
అసలు మారుతి ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడు.. జానర్ ఏంటి.. వీరి కలయికలో సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో అభిమానులు ఉత్కంఠకు గురవుతున్నారు. ఐతే పూర్తి వివరాలు చెప్పలేదు కానీ.. తన కొత్త చిత్రం ‘పక్కా కమర్షియల్’ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ సినిమా గురించి కొన్ని హింట్స్ అయితే ఇచ్చాడు మారుతి. ప్రభాస్‌కు తాను పెద్ద అభిమానినని.. ఒక అభిమానిగా ప్రభాస్ నుంచి అందరూ ఏం ఆశిస్తారో తనకు తెలుసని మారుతి వ్యాఖ్యానించాడు.
ప్రభాస్‌తో బుజ్జిగాడు, డార్లింగ్ లాంటి ఎంటర్టైనర్ తీయాలన్నది తన ఉద్దేశమని.. అలాంటి కథతోనే ప్రభాస్‌ను అప్రోచ్ అయ్యానని.. ఇంతకుమించి ఇప్పుడే ఆ సినిమా గురించి తాను ఎక్కువ మాట్లాడలేనని ప్రభాస్ స్పష్టం చేశాడు. ఏదైనా సరే.. అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే సినిమా ఉంటుందని, ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని మాత్రం మారుతి సంకేతాలిచ్చాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on June 17, 2022 9:15 am
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…