Movie News

చిరు వెర్సస్ బాలయ్య.. పక్కా

టాలీవుడ్లో హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ విషయానికి వస్తే.. చిరు-బాలయ్యల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరు దాదాపు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోగా ఆధిపత్యం చలాయించగా.. ఆయనకు గట్టి పోటీ ఇచ్చిన టాప్ స్టార్లలో బాలయ్య ఒకడు. వీళ్లిద్దరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలిస్తే ప్రేక్షకుల మధ్య విపరీతమైన ఆసక్తి ఉండేది.

ఐతే బేసిగ్గా బాలయ్యతో పోలిస్తే చిరు బాక్సాఫీస్ రేంజ్ చాలా ఎక్కువే కానీ.. ఇద్దరూ తలపడ్డ సమయాల్లో బాలయ్య నుంచి పోటీ గట్టిగానే ఉండేది. ‘మృగరాజు’ సినిమా మీద ‘నరసింహనాయుడు’ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు చూడటానికి చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది.

పదేళ్లకు పైగా సినిమాల నుంచి విరామం తీసుకుని, ‘ఖైదీ నంబర్ 150’తో చిరు రీఎంట్రీ ఇచ్చినపుడు.. బాలయ్య ఆయనతో పోటీకి సై అన్నాడు. 2017 సంక్రాంతికి చిరు చిత్రంతో బాలయ్య మూవీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తలపడింది. అప్పుడు రెండు చిత్రాలూ బాగా ఆడాయి. ఐతే టాక్ బాలయ్య సినిమాకే బాగా రాగా.. ఓవరాల్ వసూళ్లలో చిరు చిత్రం పైచేయి సాధించింది. ఆ తర్వాత మళ్లీ చిరు-బాలయ్య బాక్సాఫీస్ పోరు కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

అఖండ, ఆచార్య మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు కానీ.. అది జరగలేదు. కానీ ఈ ఏడాది ఈ సీనియర్ హీరోలు మళ్లీ బాక్సాఫీస్ దగ్గర ఢీకొట్టడం ఖాయం అంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న కొత్త చిత్రాన్ని దసరాకు షెడ్యూల్ చేశారు. దానికి పోటీగా చిరు కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’ రావచ్చని తెలుస్తోంది.

ముందు ఈ సినిమాను ఆగస్టుకే అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఆలోచన మారిందట. పండుగ టైంలో రిలీజ్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారట. ‘ఆచార్య’తో చిరు ఢీలా పడిపోగా.. బాలయ్య ‘అఖండ’తో ఊపుమీదున్నారు. హైప్ పరంగా చూస్తే ఇప్పుడు బాలయ్య సినిమాకే కాస్త ఎక్కువ మార్కులు పడతాయి. మరి చిరు ‘గాడ్ ఫాదర్’తో తిరిగి సత్తా చాటి బాలయ్య మీద పైచేయి సాధిస్తాడా అన్నది చూడాలి.

This post was last modified on June 16, 2022 10:18 pm

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

48 minutes ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

8 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

9 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

9 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

9 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

10 hours ago