Movie News

ఓటిటి ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి

రాను రాను ప్రతి శుక్రవారం ఓటిటిలోనూ విపరీతమైన పోటీ నెలకొంటోంది. ఆప్షన్లు ఎక్కువైపోయి ప్రేక్షకులు ఏది ముందు చూడాలో అర్థం కానీ కన్ఫ్యూజన్ కు లోనవుతున్నారు. ఒకపక్క సినిమాలు మరోపక్క వెబ్ సిరీస్ లు పోటీపడి మరీ పలకరిస్తున్నాయి. థియేటర్ రిలీజ్ ఫ్రైడే అంటే వీకెండ్ లెక్కలు గట్రా ఉంటాయి కాబట్టి ఏదో అనుకోవచ్చు.

ఇప్పుడీ సెంటిమెంట్ ని డిజిటల్ సంస్థలు కూడా స్ట్రిక్ట్ గా ఫాలో కావడం అనూహ్యం. శనివారం చేసినా లేక బుధగురువారాలో ఎంచుకున్నా ఇబ్బంది లేదు. కానీ అలా చేయడం లేదు. రేపు స్మార్ట్ ఎంటర్ టైన్మెంట్ మాములుగా లేదు. ప్రాధాన్యత క్రమంలో చూసుకుంటే సినిమా రేంజ్ లో అమెజాన్ ప్రైమ్ పబ్లిసిటీ చేసుకున్న వెబ్ సిరీస్ సుడల్ రేపు స్ట్రీమింగ్ కానుంది.

డబ్బింగ్ వెర్షనే అయినప్పటికి తెలుగు రాష్ట్రాల్లోనూ అవుట్ డోర్ హోర్డింగ్స్ తో భారీ పబ్లిసిటీ చేశారు. పెద్ద పేపర్ యాడ్స్ ఇవ్వబోతున్నారు. విక్రమ్ వేదా దర్శకజంట పుష్కర్ గాయత్రిలు రచన చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కు టీవీ యాడ్స్ భీభత్సంగా ఇచ్చారు. నయనతార ఓ2 హాట్ స్టార్ లో వస్తోంది. ఇది డైరెక్ట్ ఓటిటి రిలీజ్ మూవీ. ట్రైలర్ ఆసక్తి రేపింది.

తెలుగులో స్ట్రెయిట్ గా వస్తున్న మరో జీ5 సిరీస్ రెక్కె. దీనికీ హంగామా బాగానే జరిగింది. ప్రచారంలో కొంచెం వెనుకబడి ఉండే ఈ సంస్థ దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. నెట్ ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్ షీకి రెండు సీజన్ రేపే స్ట్రీమింగ్ కానుంది. డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందిన బాలీవుడ్ మూవీ మాసూమ్ ని హాట్ స్టార్ లో తీసుకొస్తున్నారు. ఇవి కాకుండా ఇంగ్లీష్, ఫ్రెంచ్ కంటెంట్ చాలానే రాబోతోంది. బయటికి కాలు పెట్టకుండానే ఇంతేసి వినోదం ఇంట్లోకే నేరుగా వస్తున్నా ఏది ఎంచుకోవాలో ఆలోచించేలా  గట్టి చిక్కే తెచ్చిపెట్టారు

This post was last modified on June 16, 2022 5:46 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

25 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

1 hour ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago