Movie News

మంచి శకునాల మధ్య చిన్న టెన్షన్

రేపు విడుదల కాబోతున్న విరాట పర్వం కోసం ఎంత ప్రమోషన్ చేయాలో అంతకన్నా ఎక్కువే టీమ్ కష్టపడింది. ముఖ్యంగా సాయిపల్లవి  హైదరాబాద్ లోనే మకాం పెట్టేసి అడిగిన ప్రతిఒక్కరికి ఇంటర్వ్యూలు ఇస్తూ, ఈవెంట్లన్నీ హాజరవుతూ ఎడతెరిపి లేకుండా వీటిలో పాల్గొంటూనే ఉంది. నిన్న జరిగిన ఈవెంట్ కి వెంకటేష్ అతిథిగా రావడం, వేడుక సక్సెస్ కావడం ఇవన్నీ శుభశకునాలే.

కొత్త జెనరేషన్ కు అంతగా అవగాహన లేని ఇలాంటి నక్సల్ బ్యాక్ డ్రాప్ సీరియస్ డ్రామాలకు ఈ స్థాయిలో పబ్లిసిటీ చేయడం చాలా అవసరం. ప్రస్తుతానికి బుకింగ్స్ అయితే మరీ జోరుగా లేవు కానీ యూనిట్ మాత్రం టాక్ మీద కాన్ఫిడెంట్ గా ఉంది. రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లు కాకపోయినా బ్రేక్ ఈవెన్ దాటేసి మంచి ప్రయత్నం చేశారని మెచ్చుకోలు వస్తే చాలనే దిశగా దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సాయిపల్లవికి నేషనల్ అవార్డు వస్తుందనే కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళలో కనిపిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి  గోవధ హత్యల గురించి చేసిన కామెంట్లు ఎంత రచ్చ చేస్తున్నాయో చూస్తున్నాం.

సోషల్ మీడియాలో తనకు నిరసనగా కొన్ని గళాలు మద్దతుగా కొందరు ఇలా విడిపోయి మరీ ఆర్గుమెంట్లు చేసుకుంటున్నారు. సాయిపల్లవి ఉద్దేశం ఏదైనా అది బయటికి  మాత్రం చిలవలు పలవలుగా వెళ్లిపోయింది. రేపు సినిమా నిజంగా బాగున్నా దానికెలాంటి  ప్రచారం జరుగుతుందోనన్న టెన్షన్ ఆమె అభిమానులతో పాటు దగ్గుబాటి ఫ్యాన్స్ కి సైతం కలుగుతోంది. గాడ్సే తప్ప పెద్దగా పోటీ లేకుండా బరిలో దిగుతున్న విరాటపర్వం లాంటి ప్రయత్నాలకు సపోర్ట్ దక్కడం చాలా అవసరం. చూడాలి మరి ఏం జరగనుందో

This post was last modified on June 16, 2022 11:09 am

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

2 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

3 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

5 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

5 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

7 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

8 hours ago