నేచురల్ స్టార్ నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘అంటే సుందరానికీ’ ప్రేక్షకుల తిరస్కారానికి గురైనట్లే చెప్పాలి. టాక్ మరీ గొప్పగా లేకపోవడం, ఆల్రెడీ మేజర్, విక్రమ్ సినిమాలు బాగా ఆడుతుండటం, టికెట్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండటం, అన్నింటికీ మించి రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో వచ్చేస్తుందన్న సమాచారం లీక్ కావడం ‘అంటే సుందరానికీ’కి మైనస్ అయి ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటిదాకా రికవరీ 50 శాతం కూడా లేదు.
తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రన్ అయ్యేసరికి బయ్యర్లు 35-40 శాతం నష్టాలు మూటగట్టుకుంటారని అంచనా. కాబట్టి సినిమాను బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకునేలా కనిపిస్తోంది. కంటెంట్ పరంగా చూస్తే హిట్ అవ్వాల్సిన సినిమానే అయినా.. ఇలాంటి ఫలితం చవిచూడాల్సి రావడం విచారించాల్సిన విషయమే.
ఐతే తెలుగు రాష్ట్రాల వరకు ‘అంటే సుందరానికీ’ ఫెయిల్యూరే కానీ.. యుఎస్‌లో మాత్రం ఈ చిత్రం బాగా ఆడుతోంది. ప్రిమియర్స్‌తోనే 2.5 లక్షల డాలర్ల దాకా వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. వీకెండ్లో ప్రేక్షకులను బాగా ఆకర్షించగలిగిన నాని మూవీ.. ఆ తర్వాత కూడా ఓ మోస్తరు ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 9 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇది మిలియన్ డాలర్ మార్కును అందుకోవడం లాంఛనమే అని చెప్పొచ్చు.
నాని కెరీర్లో ఇది ఏడో మిలియన్ డాలర్ మూవీ కావడం విశేషం. నాని చివరి సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయినా, యుఎస్‌లో కూడా బాగానే ఆడినా.. మిలియన్ డాలర్ మార్కును మాత్రం అందుకోలేకపోయింది. కానీ ‘అంటే సుందరానికీ’ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ అయి యుఎస్‌లో అంచనాలను మించిపోయి మిలియన్ డాలర్ సినిమాగా నిలవబోతుండటం విశేషమే.
This post was last modified on %s = human-readable time difference 5:19 pm
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…