సుకుమార్ ఆలోచించుకోవాల్సిందే

ఒక సినిమాతో భారీ సక్సెస్ అందుకొని దానికి పార్ట్ 2 తీస్తూ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉండే ఏ స్టార్ డైరెక్టర్ అయినా మీడియాకి అలాగే పబ్లిక్ కి కాస్త దూరంగా ఉంటూ తన పనిలో నిమగ్నవుతాడు. కానీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇందుకు భిన్నంగా ఉంటున్నాడు. అవును సుక్కు ప్రస్తుతం ఇతర సినిమా ప్రమోషన్స్ కి టైం ఇస్తూ వాటి ఫంక్షన్ లో తరచుగా కనిపిస్తున్నాడు. ‘సర్కారు వారి పాట’, ‘శేఖర్’,’అంటే సుందరానికీ’ ఇలా వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి గెస్ట్ గా మారారు సుకుమార్. ఇప్పుడు రానా ‘విరాట పర్వం’ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా హాజరు కానున్నాడు.

సర్కారు వారి పాట, అంటే సుందరానికీ మైత్రి సినిమాలు కాబట్టి తన నిర్మాతల కోసం సుక్కు వచ్చాడనుకోవచ్చు. కానీ శేఖర్ , విరాట పర్వం లకు రావడానికి మాత్రం కారణం లేదు. జస్ట్ అప్రోచ్ అవ్వగానే కాదనలేక వచ్చేస్తున్నారు. నిజానికి సుక్కు ఈ మధ్యే ‘పుష్ప 2’ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. స్క్రిప్ట్ కి కూడా తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆగస్ట్ నుండి షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. మరి ఈ సమయంలో ఇలా ఇతర సినిమాల ఈవెంట్లు , వెకేషన్స్ అంటూ ఉన్న టైంని వాటికి వాడుకుంటే ఎలా అంటూ బన్నీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

రాజమౌళి , త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఈవెంట్స్ కి దూరంగా ఉంటున్నారు. సుక్కు మాత్రం పిలిచిన ప్రతీ ఈవెంట్ కి వచ్చేస్తున్నాడు. అలా కాకుండా తను పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అంటూ స్కిప్ చేస్తే బాగుంటుంది. పబ్లిక్ లో ఎక్కువ కనిపించినా క్రేజ్ ఉండదు. అప్పుడప్పుడూ కనిపిస్తేనే ఇమేజ్ ఉంటుంది. ఇదంతా సుక్కు అనాలసిస్ చేసుకొని ఇకపై పుష్ప సీక్వెల్ పై మాత్రమే దృష్టి పెడితే బాగుంటుంది మరి.