గాడ్సె.. ఈ శుక్రవారం రిలీజవుతున్న చిత్రాల్లో ఒకటి. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో రోమియో, బ్లఫ్ మాస్టర్ చిత్రాలు రూపొందించిన గోపీ గణేష్ ఈ సినిమా తీశాడు. సత్యదేవ్ ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్లో నటించిన ఈ చిత్రం.. ప్రస్తుత రాజకీయాల్లో, వ్యవస్థలో కుళ్లును కడిగి పడేసే నేపథ్యంలో నడిచే కథతో తెరకెక్కింది. ట్రైలర్లో డైలాగులు చాలా పవర్ ఫుల్‌గా కనిపించాయి. కాకపోతే సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి కాస్త ఆలస్యంగా రిలీజవుతుండటంతో ఆశించిన స్థాయిలో బజ్ క్రియేటవ్వలేదు.
‘విరాటపర్వం’ మీద ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా నిలిచి ఉండడం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ఇలాంటి తరుణంలో గోపీ గణేష్‌తో ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ కొంచెం వివాదాస్పదంగా మారడం, ఆ ఇంటర్వ్యూ నుంచి గోపీ వాకౌట్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఈ సినిమాలో కొన్ని డైలాగులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసేలా ఉండడం మీద ఇంటర్వ్యూయర్ గోపీ గణేష్‌ను ప్రశ్నించారు. మీకు కొందరు రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వచ్చాయట నిజమేనా అని అతను అడిగాడు.
దీనికి గోపీ బదులిస్తూ.. తాను సిన్సియర్‌గా ఒక సినిమా తీశానని.. దీని మీద కాంట్రవర్శీలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. నన్ను బెదిరించినట్లుగా మీకెవరు చెప్పారు.. మీ మాటలు చూస్తుంటే అధికార పార్టీకి అమ్ముడుపోయినట్లుగా అనిపిస్తోంది అని కూడా వ్యాఖ్యానించాడు. దీనికి ఇంటర్వ్యూయర్ బదులిస్తూ.. మీరు ప్రతిపక్ష పార్టీకి అమ్ముడుపోయినట్లు అనిపిస్తోందని అన్నాడు. మాటా మాటా పెరిగి గోపీ గణేష్ స్టూడియో నుంచి వెళ్లిపోవడానికి పైకి లేచాడు. ఐతే ఇంటర్వ్యూయర్ ఆయనకి సర్దిచెప్పి కొన్ని నిమిషాల తర్వాత ఇంటర్వ్యూ కొనసాగేలా చూశాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో బాగానే తిరుగుతోంది. కాకపోతే ఇదంతా సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి చేసిన ప్లాన్డ్ కాంట్రవర్శీయేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.
This post was last modified on June 15, 2022 12:28 pm
సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్‌లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…