బాలీవుడ్ బాహుబలిగా అక్కడి ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్న బ్రహ్మస్త్ర ట్రైలర్ ఇవాళ విడుదలయ్యింది.. తెలుగు వెర్షన్ కు రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనే దగ్గరుండి తెలుగు రాష్ట్రాలకు టీమ్ ని తిప్పుతూ ప్రమోషన్లు గట్రా చేయిస్తున్నారు. కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర చేయడంతో ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ దీని మీద ఆసక్తి నెలకొంది. కాకపోతే ముందు నుంచి పాజిటివ్ గా అనిపించిన వైబ్రేషన్స్ ఒక్కసారిగా ట్రైలర్ వచ్చాక మారిపోయినట్టు కనిపిస్తోంది. భారీ అంచనాలు పెట్టేసుకున్న నార్త్ ఆడియన్స్ ని సైతం పూర్తి స్థాయిలో మెప్పించలేదని అధిక శాతం కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యంగా అందులో విజువల్స్, గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవని నెటిజెన్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. వీడియో గేమ్ తరహాలో అనిపిస్తున్నాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ యువకుడికి తనకు అతీత శక్తులు ఉన్నాయనేది తెలియదు. తర్వాత జరిగిన సంఘటనల వల్ల అగ్ని తననేమి చేయలేదని తెలుసుకుంటాడు. బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం తన శరీరమని మిత్రులు, శత్రువులు గుర్తిస్తారు. ఆ తర్వాత జరిగే పరిణామాల క్రమమే దీని కథ. ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవితో ఈ ట్రయిలర్ కోసం వాయిస్ ఓవర్ ఇప్పించడం నిన్న వీడియో రూపంలో చూశాంగా.
ఇంత బలమైన లైన్, క్యాస్టింగ్ పెట్టుకున్నప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ వావ్ అనిపించేలా ఉండాలి. కానీ ట్రైలర్ లో చూపించిన షాట్స్ లో ఏది వెలితి కనిపిస్తోంది. ఎంతసేపూ అగ్గిని రాజేస్తూ గాలిని చీల్చుకుంటూ వెళ్లే సీన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్వాలిటీలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ బ్రహ్మాస్త్రం మూడు భాగాలతో రూపొందుతోంది. ఈ ఫస్ట్ పార్ట్ శివ విజయం సాధించడం మీదే మిగిలిన రెండు సీక్వెల్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దీన్నో ఫ్రాంచైజ్ లా చేయాలని నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ ఆలోచన. మరి అసలు సినిమాలో ఇక్కడ రివీల్ చేయని సర్ప్రైజులు ఏమైనా ఉన్నాయేమో సెప్టెంబర్ 9న చూడాలి
This post was last modified on June 15, 2022 11:07 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…