వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో అనీల్ రావిపూడి తెరకెక్కించిన ‘F3’ ఓ మోస్తరు సక్సెస్ అనిపించుకుంది. తొలి వారం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు అందుకుంది. అక్కడి నుండి యూనిట్ ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమాను పుష్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వెంకీ , వరుణ్ ఈ సినిమాను రిలీజ్ తర్వాత కూడా బాగా ప్రమోట్ చేసుకున్నారు. అనిల్ రావిపూడి కూడా రిలీజ్ కి ముందు బజ్ తీసుకురావడంలో సక్సెస్ సాధించి థియేటర్స్ కి ప్రేక్షకులను రాప్పించగలిగాడు. ఇక రిలీజ్ కి ముందు మెహ్రీన్ కూడా ప్రమోషన్స్ లో బాగానే కనిపించింది. తమన్నా మాత్రం ఎఫ్ 3 ప్రమోషన్స్ లో కనిపించకుండా మిగతా సొంత ఈవెంట్స్ కవర్ చేసుకుంది.
అయితే తమన్నా ఒక్కద్దే కాదు మొదటి నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించలేదు. నిజానికి దేవి కొన్ని రోజులు ఏవో ఈవెంట్స్ తో అలాగే అబ్రాడ్ టూర్ లో బిజీగా ఉన్నాడు. కానీ రిలీజ్ కి ముందు లేదా రిలీజ్ తర్వాత ఒక్క ఈవెంట్ కి కూడా దేవి రాకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అనిల్ రావిపూడి కి తమన్నా కి షూటింగ్ లో చిన్న గొడవ జరిగింది. ఈ విషయాన్ని అనీలే స్వయంగా చెప్పుకున్నాడు కానీ ఇప్పుడెం లేదని తమన్నా వేరే షూటింగ్ లో బిజీ అంటూ కవర్ చేసుకున్నాడు. ఇక రిలీజ్ తర్వాత తమన్నా కి తన రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏదో చిన్న తేడా వచ్చిందని ఇన్సైడ్ టాక్.
ఏదేమైనా తమన్నా ఎఫ్ 3 ప్రమోషన్స్ లో కనిపించకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. కానీ దేవి ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎందుకు స్కిప్ చేశాడనేది మాత్రం తెలియడం లేదు. నిజంగానే బిజీగా ఉన్నాడా లేదా డైరెక్టర్ అనిల్ కి అతనికి ఏమైనా ఇష్యూ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. సక్సెస్ మీట్ లో ఈసారి వెంకటేష్ మిస్ అయ్యాడు. వెంకీ లేకపోవడంతో ఈవెంట్ లో ఏదో వెలితి కనిపించింది.
This post was last modified on June 14, 2022 9:07 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…