ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్టు చూస్తే అందులో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఇటివలే ‘లవ్ స్టోరి’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పకరించిన సాయి పల్లవి ‘విరాటపర్వం’ తో త్వరలోనే మరోసారి థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి. వెన్నెల పాత్ర సినిమాకు హైలైట్ కానుందని టీం గట్టిగా చెప్తోంది.
అయితే నెలల గ్యాప్ లో తెలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించే సాయి పల్లవి ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకోబోతుంది. అవును సాయి పల్లవి నెక్స్ట్ లిస్టులో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఈ విషయం తనే మీడియాకి చెప్పుకుంది. ప్రస్తుతం తెలుగు కథలు వింటున్నానని, ఇంకా ఏమి ఫైనల్ చేయలేదని తెలిపింది. తమిళ్ లో ‘గార్గి’ అనే సినిమాతో పాటు శివ కార్తికేయన్ తో మరో సినిమా చేస్తున్నట్లు చెప్పుకుంది.
అంటే ‘విరాటపర్వం’ తర్వాత సాయి పల్లవి లిస్టులో ఒక్క తెలుగు సినిమా కూడా లేదన్న మాట. మరి త్వరలోనే ఏదైనా సినిమా ఓకె చేసుకొని సైన్ చేస్తుందా ? లేదా తెలుగులో కొంచెం బ్రేక్ తీసుకోనుందా ? తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈవెంట్స్ లో తన క్రేజ్ తో అందరికీ మతి పోగోడుతున్న సాయి పల్లవి చకచకా తెలుగు సినిమాలు చేస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on June 14, 2022 8:43 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…