నేచురల్ స్టార్ నానికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. అతడి కొత్త సినిమా అంటే సుందరానికి విమర్శకుల ప్రశంసలు అందుకుని, డీసెంట్ టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. వీకెండ్లోనే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. ఆ తర్వాత మరింత వీక్ అయిపోయింది. తొలి మూడు రోజుల్లో రూ.10.4 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది ఈ చిత్రం. నాని బాక్సాఫీస్ స్టామినాతో పోలిస్తే ఇవి నామమాత్రమైన వసూళ్లే.
ఎ సినిమా అయినా వీకెండ్ వరకే బాగా ఆడుతున్న ఈ రోజుల్లో తొలి మూడు రోజుల్లో 70 శాతానికి పైగా రికవరీ ఉంటే తప్ప సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. అలాంటిది రూ.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న అంటే సుందరానికీ.. వీకెండ్లో అందులో 40 శాతం మాత్రం మాత్రమే వెనక్కి తేగలిగింది. ఆదివారం ఈ చిత్రం రూ.3 కోట్ల దాకా షేర్ రాబట్టగా.. సోమవారం వరల్డ్ వైడ్ కోటి రూపాయల షేర్ కూడా రాబట్టలేకపోయింది.
ఇక సినిమా పుంజుకుంటున్న ఆశలేమీ కనిపించడం లేదు. రెండో వీకెండ్లో పుంజుకునే అవకాశాలు కూడా తక్కువే. ఈ వారం రాబోతున్న విరాటపర్వం ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ముందు వారం వచ్చిన విక్రమ్ ఇంకా బాగా ఆడుతోంది. మేజర్ కూడా పర్వాలేదు. వీటికి పక్కన పెట్టి అంటే సుందరానికీ చిత్రానికి ప్రేక్షకులు ప్రయారిటీ ఇవ్వడం కష్టంగానే ఉంది.
ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగింపు దశకు వచ్చినట్లే కనిపిస్తోంది. ఫుల్ రన్లో షేర్ రూ.15 కోట్ల మార్కును అందుకుంటే ఎక్కువ అనుకోవచ్చు. బయ్యర్లు దాదాపు 30-35 శాతం మధ్య నష్టాన్ని భరించాల్సి రావచ్చు. మైత్రీ వాళ్ల గత సినిమా సర్కారు వారి పాట కూడా బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది. ఇప్పుడు అంటే సుందరానికీ కూడా బయ్యర్లను దెబ్బ కొట్టింది. ఈ ప్రభావం వారి తర్వాతి చిత్రాల బిజినెస్ మీద పడడం గ్యారెంటీ.
This post was last modified on June 14, 2022 3:20 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…