మేజర్ సూపర్ హిట్టయిపోయింది. దేశవ్యాప్తంగా 50 కోట్ల మార్కుని దాటేసి ఇంకా స్టడీగానే వెళ్తోంది. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. చిరంజీవి ఏకంగా లంచ్ పెట్టి మరీ టీమ్ ని అభినందనలతో ముంచెత్తారు. రిలీజ్ కు ముందు చేసిన ప్రమోషన్లు, తొమ్మిది రోజుల ముందు వేసిన ప్రీమియర్లు అన్నీ మంచి ఫలితాన్ని ఇచ్చాయి. విక్రమ్ ప్రభావం వల్ల కలెక్షన్లలో డ్రాప్ ఉంది కానీ మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే కాదు. మొత్తానికి ఊహించిన దాని కన్నా బెటర్ గా అడవి శేష్ కెరీర్ బెస్ట్ గా మేజర్ నిలిచింది.
అలా అని ఈ క్రెడిట్ మొత్తం హీరోకి, దర్శకుడు శశికిరణ్ తిక్కకు ఇవ్వలేం. శేష్ ఎంత కష్టపడినా నిర్మాతల్లో భాగస్వామి అయిన మహేష్ బాబు ప్రోత్సాహం, తన బ్రాండ్ వేల్యూ మేజర్ కి చాలా ఉపయోగపడ్డాయి. ఎన్నడూ లేనిది దీని కోసం ఆయనే ఓ వీడియో మీమ్ లాంటిది చేయడం బట్టే ఎంతగా మేజర్ ని సొంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. నిర్మాతలకు సోషల్ మీడియా మేనేజ్ మెంట్ లో అనుభవం ఉండటం ఇక్కడ కలిసి వచ్చింది. ఏదైతేనేం ఒక మంచి సినిమాకు రావాల్సిన స్పందన, గౌరవం దక్కాయి.
ఇప్పుడు అడవి శేష్ ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగింది, మార్కెట్ తనను ఎలా చూస్తోందనేది హిట్ 2 సెకండ్ కేస్ రిలీజ్ అప్పుడు బయటపడుతుంది. జూలై 29న విడుదల కానున్న ఈ మూవీపై ఇప్పటికి అంచనాలేం పెద్దగా లేవు. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిందంతే. ఇంకా టైం ఉంది కాబట్టి పబ్లిసిటీ మొదలుపెట్టలేదు. ఇప్పుడు మేజర్ ఫలితాన్ని ఆధారంగా చేసుకుని హిట్ 2కి ఎంత థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది, ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందనేది చూడాలి. ఒకవేళ మంచి ఓపెనింగ్ సాధిస్తే మాత్రం శేష్ స్టాండర్డ్ అయిపోయినట్టే. ఎలాగూ మేజర్ నార్త్ ఆడియన్స్ కి సైతం రీచ్ అయిపోయింది కాబట్టి ఇది కూడా ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తారేమో.
This post was last modified on June 14, 2022 11:45 am
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…