బాగా లేని సినిమా తీసి అది ప్రేక్షకాదరణ పొందకపోతే బాధ కొంచెమే ఉంటుంది. సరైన సినిమా చేయలేదు ప్రేక్షకులు ఆదరించలేదు అని సర్దిచెప్పుకోవడానికి అవకాశముంటుంది. కానీ మంచి సినిమా చేసి కూడా సరైన ఆదరణ దక్కపోతే బాధ చాలా ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ ప్రతిసారీ కొత్తగా ఏదో చేయాలని ప్రయత్నిస్తూ, నటుడిగా తన వైపు నుంచి ఏ లోటు లేకుండా చూసుకుంటూ.. ప్రేక్షకులకు అత్యుత్తమ వినోదాన్ని ఇవ్వడానికి ప్రయత్నించే నాని లాంటి హీరోలు ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమాకు సరైన స్పందన లేకుంటే నిరాశ చెందడం సహజం.
‘అంటే సుందరానికీ’ విషయంలో నాని ఫీలింగ్ ఇదే అన్నది సన్నిహిత వర్గాల సమాచారం. వి, టక్ జగదీష్ చిత్రాలతో తన క్రెడిబిలిటీని కొంత దెబ్బ తీసుకున్న నాని.. ‘శ్యామ్ సింగ రాయ్’తో మళ్లీ సత్తా చాటాడు. మామూలుగా అయితే ఆ చిత్రం కూడా ఇంకా పెద్ద స్థాయి విజయం సాధించాల్సిందే కానీ.. మారిన బాక్సాఫీస్ పరిస్థితుల్లో దాని ఫలితంతో నాని అండ్ కో సంతృప్తి చెందింది.
ఐతే ‘అంటే సుందరానికీ’ దాంతో పోలిస్తే ఇంకా కొత్తగా, వినోదాత్మకంగా ఉంటుంది. నాని తన పాత్రను ఎంతో ఇష్టపడి, కథను ఎంతగానో నమ్మి చేసిన సినిమా ఇది అన్నది స్పష్టం. కచ్చితంగా నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాయే ఇది. కానీ సినిమా కొంచెం లెంగ్తీగా ఉండటం, అక్కడక్కడా కొంచెం ల్యాగ్ ఉండడం ప్రతికూలం అయింది. టికెట్ల ధరలు, కొవిడ్ తర్వాత థియేటర్లలో సినిమాలు చూసే విషయంలో మారిన ప్రేక్షకుల ఆలోచన కూడా ఈ చిత్రానికి ప్రతికూలం అయ్యాయి. ఫలితంగా సినిమా బ్రేక్ ఈవెన్ కావడం చాలా కష్టంగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫెయిల్యూర్ అయ్యేలాగే ఉంది.
ఈ నేపథ్యంలో వీకెండ్ తర్వాత సినిమా మరీ వీక్ అయిపోతుందనే భయంతో సక్సెస్ మీట్ పెట్టింది చిత్ర బృందం. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ నంబర్స్ ముఖ్యం కాదని, కాల క్రమంలో ‘అంటే సుందరానికీ’ చాలా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుందని, ఈ ఏడాది చివర్లో ఉత్తమ చిత్రాల జాబితా తీస్తే ఈ సినిమా ఉంటుందని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అతడి మాటల్ని బట్టి చూస్తే.. సినిమాకు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం రాలేదని, ఈ విషయంలో నాని బాగా నిరాశ చెందాడని అర్థమైపోయింది. ఇలాంటి మాటలు ఎన్ని చెప్పినా.. అంతిమంగా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి ఫలితం రాబట్టిందన్నదే ప్రధానం అన్నది మాత్రం స్ఫష్టం. ఆ విషయం నానీకి కూడా తెలియంది కాదు.
This post was last modified on June 14, 2022 8:49 am
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…