నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంటే సుందరనికీ’ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. నాని పెర్ఫార్మెన్స్ , నజ్రియా , కామెడీ సీన్స్ ,వివేక్ రైటింగ్ తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాకపోతే సినిమాకు లెంగ్త్ అనేది డ్రాగ్ బ్యాక్ అయ్యింది. దీంతో రిలీజ్ రోజు మార్నింగ్ షో నుండే రన్ టైం గురించి ప్రేక్షకులను నుండి ఫీడ్ బ్యాక్ వచ్చేసింది.
రెండో రోజు కచ్చితంగా మేకర్స్ ఆ జాగ్రత్త తీసుకొని కొంచెం ట్రిమ్ చేసి రన్ టీం తగ్గిస్తారేమో అని భావించారు అంతా. కానీ అలా జరగలేదు. సినిమాకు సంబంధించి రెండు గంటల యాబై ఆరు నిమిషాల నిడివినే ఉంచేశారు మేకర్స్. ఒక్క ముక్క కూడా తీయకుండా ఆ విషయంలో తగ్గేదే లే అంటూ నమ్మిన సిద్దాంతాన్ని పట్టుకొని కూర్చున్నారు.
తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో కూడా రన్ టైం ఎక్కువైంది అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు కదా ఏమైనా తగ్గించే ఆలోచన ఉందా ? అనే ప్రశ్న టీంకి మీడియా నుండి ఎదురైంది.దీనికి దర్శకుడు వివేక్ ఆత్రేయ నుండి జబాబు వచ్చింది. అలాంటిదేం లేదంటూ ఫస్ట్ హాఫ్ లో ఆ స్పీస్ తీసుకొని చెప్పడం వల్లే సెకండాఫ్ బాగా వర్కౌట్ అయిందంటూ సో ఫస్ట్ హాఫ్ లో ఆ రన్ టైం ఉండాల్సిందే అన్నాడు.
అంతే కాదు సెకండాఫ్ ని బాగా హ్యాండిల్ చేసిన నాకు ఫస్ట్ హాఫ్ ని తీయడం రాక కాదు అందులో అవన్నీ చూపిస్తేనే సినిమా బాగుంటుంది అంటూ ఏదో చెప్పుకొచ్చాడు. ఏదేమైనా అంటే కి రన్ టైం ఎక్కువ ఉండటం దాంతో కంటెంట్ డ్రాగ్ అనిపిస్తూ థియేటర్స్ లో కాస్త బోర్ కొట్టిస్తుంది. మేకర్స్ మాత్రం ఆ విషయంలోనే తగ్గదే లే అంటూ గట్టి పట్టు పట్టారు. ఏదేమైనా రిలీజ్ కి ముందు టీం నిడివి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని కొన్ని సీన్స్ తొలగించి ఉంటె యుననిమాస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చేది.
This post was last modified on June 13, 2022 9:01 pm
2025 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. నిన్న చెన్నైలో…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన చిరుత మూవీతో తెలుగు సినీ…
ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్…
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…