ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్లు లిప్ లాక్ చేస్తేనే పెద్ద చర్చ నడిచేది. కానీ ఇప్పుడది చాలా మామూలు వ్యవహారం అయిపోయింది. ఆ దశను దాటి బయట ఎవరైనా లిప్ లాక్ చేసినా తేలిగ్గా తీసుకుంటున్నాం. ఐతే ఒక హీరో, దర్శకుడు కలిసి లిప్ లాక్ అన్నది మాత్రం ఇప్పుడు కూడా షాకింగ్ వ్యవహారమే.
రెండు రోజుల కిందటే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పేరెపు కలిసి అధర చుంబనంలో మునిగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాలీవుడ్లో ఇలాంటివి మామూలే కానీ.. మన దగ్గర మాత్రం కొత్తే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదేం చోద్యం అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవికాంత్‌ను అడిగితే మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నాడు.
‘కృష్ణ అండ్ హిజ్ లీల’ కోసం మూడేళ్ల కిందట్నుంచి ప్రయాణం చేస్తున్నారు సిద్ధు, రవికాంత్. ఈ చిత్రానికి ఇద్దరూ కలిసి స్క్రిప్టు రాయడం విశేషం. ఈ సినిమా కోసం తామిద్దరం ఎంతో కష్టపడ్డామని.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం, మంచి స్పందన తెచ్చుకోవడంతో ఆ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి సూచికగా ఇలా సరదాగా లిప్ లాక్ చేశామని రవికాంత్ తెలిపాడు.
తమ ఇద్దరి అభిరుచులు ఒకరికొకరు బాగా తెలుసని.. దీంతో చక్కటి సమన్వయంతో ఈ సినిమాకు పని చేశామని, తన పాత్రకు సంబంధించిన డైలాగులన్నీ సిద్ధునే రాసుకున్నాడని రవికాంత్ వెల్లడించాడు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ కంటే ముందు తాను రానా కోసం ఓ కథ రాశానని.. కానీ అది ఎవరికీ అంతగా నచ్చలేదని.. దీంతో వేరే కథ రాయగా దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి రానా, సురేష్ బాబు ముందుకొచ్చారని.. అలా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ పట్టాలెక్కిందని రవికాంత్ వెల్లడించాడు.
This post was last modified on June 27, 2020 2:29 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…