Movie News

మెగామూవీకి నితిన్ ఓకే ?

సైరా తర్వాత చిరంజీవి ఎంచుకుంటున్న సినిమాల వరస చూస్తుంటే అందులో ఎవరో ఒకరు ఇప్పటి జెనరేషన్ హీరో ఉండేలా జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది. అది కాకతాళీయంగా జరిగిందో లేక అలా ప్లాన్ చేసుకుని సెట్ చేసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి రకరకాల కాంబోలు వస్తున్నాయి. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర పెద్దగా ఉపయోగపడలేదు. గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ ఏ మేరకు ప్లస్ అవుతాడో ఫలితం వచ్చాకే తెలుస్తుంది. వాల్తేర్ వీరయ్యలో రవితేజ ఉన్నాడనే ప్రకటనే అంచనాలు పెంచేసింది.

తాజాగా భోళాశంకర్ కు సైతం అలాంటి టాకే వినిపిస్తోంది. ఇందులో మెగాస్టార్ చెల్లిలిగా నటిస్తున్న కీర్తి సురేష్ కు జోడిగా యంగ్ హీరో నితిన్ ని లాక్ చేసినట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు ఓకే చేశారని వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో యవ దర్శకులు కుర్ర స్టార్లు చిరుతో ఒక నోస్టాల్జిక్ మెమరీ కావాలని తాపత్రయపడుతున్నారు. డైరెక్టర్లు రిఫరెన్సులు ఇంటర్వ్యూల రూపంలో వాడితే, హీరోలు ఎక్కువా తక్కువాని పాత్రతో సంబంధం లేకుండా ఛాన్స్ ఉంటే చాలు వీలైనంత చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు.

బహుశా నితిన్ కూడా ఈ కోణంలోనే ఆలోచించి ఉండొచ్చు. అఫీషియల్ అయ్యేదాకా వేచి చూడాలి. ఇక భోళా శంకర్ షూటింగ్ త్వరలోనే రీ స్టార్ట్ కానుంది. గాడ్ ఫాదర్ తాలూకు పనులన్నీ దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. సల్మాన్ తో చేయాల్సిన పాట షూట్ ఒకటి బ్యాలన్స్ ఉంది. ఆయన ఎలాగూ హైదరాబాద్ లోనే ఉన్నాడు కాబట్టి ఫినిష్ చేసేయొచ్చు. అయితే వాల్తేర్ వీరయ్య ఫస్ట్ రిలీజవుతుందా లేక భోళా శంకర్ ను రేస్ లో ముందు నిలుపుతారా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. ఆ ప్రశ్నకు సమాధానం తెలిసింది ఒక్క చిరుకే.

This post was last modified on June 13, 2022 12:08 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

4 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

5 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

5 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

5 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

7 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

8 hours ago