టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడైన నిఖిల్ సిద్దార్థ్ వరుసగా సినిమాలు రెడీ చేస్తున్నాడు. అవును ఈ కుర్ర హీరో చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వీటన్నిటికీ సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. వచ్చే నెలలో కార్తికేయ 2 తో ముందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆ తర్వాత 18 పేజెస్ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. అలాగే ఎడిటర్ గ్యారీ దర్శకత్వంలో ‘స్పై’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. అలాగే సుదీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజికి తీసుకొచ్చాడు. ఆ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు.
ఇలా నాలుగు సినిమాలను జెట్ స్పీడులో రెడీ చేసి నెలల గ్యాపులోనే ప్రేక్షకులను వరుసగా ఎంటర్టైన్మెంట్ అందించదానికి రెడీ అవుతున్నాడు. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఫోకస్ పెడుతున్నాడు. చందూ మొండేటి తోనే ఇంకో సినిమా చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇద్దరి మధ్య స్క్రిప్ట్ డిస్కషన్ కూడా జరిగింది. నిఖిల్ డేట్స్ ఖాళీ అవ్వగానే ఈ కాంబోలో మరో సినిమా రానుంది.
అలాగే మరికొందరు దర్శకులతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. డెబ్యూ డైరెక్టర్ తో కూడా నిఖిల్ ఓ సినిమా చేయనున్నాడని టాక్. ఏదేమైనా నిఖిల్ నుండి వస్తున్న నాలుగు సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తే ఇక యంగ్ హీరోల్లో నిఖిల్ ఓ అరుదైన రికార్డు కొట్టినట్టే.
This post was last modified on June 13, 2022 7:28 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…