ఏ సినిమా అయినా థియేటర్ సక్సెసనేది కలెక్షన్ల మీద ఆధారపడి ఉంటుంది. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే నెంబర్లను బట్టే దాని అసలు ఫలితం డిసైడ్ అవుతుంది. కానీ ఆ అవకాశం ఓటిటిలో ఉండదు.యుట్యూబ్ తరహాలో ఇన్నేసి మిలియన్ల వ్యూస్ వచ్చాయని చెప్పేందుకు సాధారణంగా ఏ సంస్థ ఇష్టపడదు. కానీ విపరీతంగా పెరిగిపోయిన పోటీ వల్ల ఇప్పుడా ట్రెండ్ మెల్లగా మారుతోంది. తమ ప్లాట్ ఫార్మ్ లో చందాదారులు ఎన్ని నిముషాలు ఎన్ని గంటల సేపు కొత్త కంటెంట్ ని చూశారో ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు.
అందరి చూపు సహజంగానే ఆర్ఆర్ఆర్ మీద వెళ్తోంది. తెలుగు సహా నాలుగు భాషల్లో జీ5 స్ట్రీమింగ్ చేయగా హిందీ వెర్షన్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ ఒక్కదానికే భారీగా మార్కెటింగ్ చేసింది. అయితే దేంట్లో ఎక్కువ చూశారని ఆసక్తి కలగడం సహజం. అవేంటో చూద్దాం. జీ5 చెప్పిన ప్రకారం ట్రిపులార్ 190 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. 1000 మిలియన్ నిమిషాల వ్యూస్ వచ్చాయని అఫీషియల్ గా ప్రకటించింది. అంటే గంటల లెక్కలో చూసుకుంటే 16,666,667 గంటలన్న మాట. ఇది జీ5లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ కలిపి.
ఇక నెట్ ఫ్లిక్స్ సంగతి చూస్తే మూడు వారాల దాకా 39,480,000 గంటల వ్యూస్ సాధించింది. సింపుల్ గా చెప్పాలంటే జీ5 కన్నా నెట్ ఫ్లిక్స్ లో 22,813,334 గంటల వ్యూస్ అధికంగా వచ్చాయి. ఎలా చూసుకున్న రెండింటి మధ్య చాలా గ్యాప్ ఉంది. నెట్ ఫ్లిక్స్ కున్న గ్లోబల్ రీచ్ ఆర్ఆర్ఆర్ ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. దేశవిదేశాల నుంచి సెలబ్రిటీ ట్వీట్లు ట్రిపులార్ ని పొగడ్తలతో ముంచెత్తాయి. కంటెంట్ ప్రమోషన్, క్వాలిటీ విషయంలో కొంత వెనుకబడి ఉన్న జీ5 ఇండియాలో మాత్రం ఆర్ఆర్ఆర్ ని నెంబర్ వన్ గా ఉంచేసింది. రాటెన్ టొమాటోస్ లో ఆర్ఆర్ఆర్ నమోదయ్యాక దీని గురించిన ప్రచారం మరింతగా పెరిగిపోయింది. రాజమౌళా మజాకా.
This post was last modified on June 12, 2022 6:25 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…