బాలీవుడ్ సినిమాల్లో నటిస్తే ఇండియా వైడ్ అప్పీల్ వస్తుందనే మాట వాస్తవమే కానీ అది ఒకానొక టైంలో. ఇప్పుడు హిందీ స్టార్లే మన హీరోలు దర్శకులతో పని చేసేందుకు ఎగబడుతున్నారు. కానీ నాగార్జున మాత్రం కెరీర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా వీలు చిక్కినప్పుడంతా క్యామియోనా లీడ్ క్యారెక్టరా అనేది చూసుకోకుండా అక్కడి సినిమాలు చేస్తూ వచ్చారు. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్రంలో కూడా తను హీరో కాదు. రన్బీర్ కపూర్ అలియా భట్ లు మెయిన్ లీడ్ కాగా నాగ్ ది స్పెషల్ క్యారెక్టర్.
కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. 1992లో మొదటిసారి ఇలాంటి పాత్రలు మొదలుపెట్టారు నాగార్జున. ఖుదా గవాలో అమితాబ్ బచ్చన్ శ్రీదేవిల మీద ఆ సినిమాను మార్కెటింగ్ చేస్తే ఆ కాంబినేషన్ తనకూ మంచి మెమరీ అవుతుందని చేశారు. బొమ్మ యావరేజ్ అయ్యింది.
1996 అనిల్ కపూర్-శ్రీదేవిల మిస్టర్ బేచారాలోనూ గెస్ట్ రోలే. 1998 అంగారేలో యువసామ్రాట్ కన్నా అక్షయ్ కుమార్ హైలైట్ అయ్యాడు.1998 జక్మ్ లో అజయ్ దేవగన్ మెయిన్ హీరో అయితే గెస్ట్ అప్పీయరెన్స్ లో నాగ్ కనిపించేది కాసేపే.
2002 అగ్ని వర్ష మరీ దారుణం. సినిమా నిండా స్టార్లు ఉన్నారు కానీ బాక్సాఫీస్ వద్ద తుస్సుమంది. 2003 ఎల్ఓసి వల్లనూ నాగార్జునకు ఒరిగిందేమి లేదు. ఇవన్నీ పరిశీలించి చూస్తే ఏదీ బ్లాక్ బస్టర్ కాదన్న విషయం అర్థమవుతుంది.. అన్నట్టు తెలుగులోనూ నాగ్ కు గెస్ట్ రోల్స్, అలా తళుక్కున కనిపించే పాత్రలు అచ్చిరాలేదు.
రావుగారిల్లు, అధిపతి, కృష్ణార్జున, సైజ్ జీరో, ఘటోత్ఘచుడు, తకిట తకిట అన్నీ దాదాపుగా సోసోగా ఆడినవే. మరి భారీ అంచనాలతో వస్తున్న బ్రహ్మాస్త్రం ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందేమో చూడాలి.
This post was last modified on June 12, 2022 7:07 pm
స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…
ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…