వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనల నియంత్రణకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం సరోగేట్ యాడ్స్ ని నిషేధించింది. సరోగేట్ యాడ్స్ అంటే ఏమిటి ? ఏమిటంటే ప్రచారం చేయటానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటిపేరుతోనే అదేరీతిలో ఉండేట్లుగా కనిపించేలాగ అడ్వర్టైజ్మెంట్లను చూపించటం.
కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు ఇపుడు కనబడుతున్న ప్రకటనలకు కూడా వర్తిస్తుందని కేంద్రం చెప్పింది. ఈ ప్రకటనల్లో కనబడుతున్న ప్రముఖులు, సెలబ్రిటీలపైన కూడా చర్యలు తీసుకోబోతున్నట్లు మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టంగా చెప్పింది. వినియోగదారులను ఆకర్షించేలా రాయితీలు, ఉచితాల వంటి ప్రకటనలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. అలాగే పిల్లలను టార్గెట్ గా చేసుకుని కనిపించే యాడ్స్ కు కూడా ఇవే వర్తిస్తాయి.
‘తప్పుదోవ పట్టించే ప్రకటనల నిరోధం-22’ పేరుతో వినియోగదారుల రక్షణ చట్టం పేరుతో కేంద్రం మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పింది. తాజా మార్గదర్శకాల ప్రకారం మొదటిసారి చట్టాన్ని ఉల్లంఘించే అడ్వర్టైజ్మెంట్లకు రు. 10 లక్షల ఫైన్ వేస్తారు. తర్వాత ప్రతిసారి రు. 50 లక్షల చొప్పున జరిమానా విధిస్తారు. తయారీదారులు, ప్రచారకర్తలు, ప్రకటనకర్తలు అందరికీ మార్గదర్శకాలు కచ్చితంగా వర్తిస్తాయి వార్నింగ్ ఇచ్చింది.
మార్గదర్శకాలకు విరుద్ధంగా కనిపించిన ప్రకటనల్లో కనిపించిన సెలబ్రిటీలు, ప్రముఖులు, ప్రకటనలను తయారు చేసిన అడ్వర్టైజ్మెంట్ సంస్ధలకు, ఉత్పత్తుల తయారీ సంస్ధలకు కూడా ఈ ఫైన్లు వర్తిస్తాయి. ప్రకటనలు జనాలను బాగా ఆకర్షిస్తుంది. లిక్కర్ ప్రకటనలను పోలినట్లుండే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇపుడు టీవీల్లో కనబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. టీవీల్లో కనబడరిచే ప్రకటనల్లో మినరల్ వాటర్ అని షోడాని చెబుతుంటారు. కానీ సదరు ప్రకటనను చూస్తున్నపుడు అందరికీ గుర్తుకొచ్చేది లిక్కర్ మాత్రమే. ఇలాంటి ప్రకటనలు టీవీల్లో చాలానే కనబడుతుంటాయి. అలాంటి వాటిల్లో కనిపించే సెలబ్రిటీలకూ ఇకనుండి ఫైన్ పడుతుంది. అంటే డబ్బుకోసం కక్కుర్తిపడే సెలబ్రిటీలు ఇకనుండి జాగ్రత్తగా ఉండకపోతే బుక్ అయిపోవటం ఖాయం.
This post was last modified on June 12, 2022 12:19 pm
సాక్ష్యాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి అందులోనూ కోట్లాది అభిమానులున్న పవన్ కళ్యాణ్ పబ్లిక్ స్టేజి మీద పొగడటం కన్నా ఎవరికైనా…
ఆస్తులు మాత్రమే కావాలి. వాటిని సంపాదించి పెట్టిన తల్లిదండ్రుల్ని మాత్రం లైట్ తీసుకునే బిడ్డల సంఖ్య తక్కువేం కాదు. అలాంటి…
https://youtu.be/fNDRSver0uM?si=FuJxROyuCDfNq7jV వరస బ్లాక్ బస్టర్లతో ఊపుమీదున్న బాలకృష్ణ సంక్రాంతి పండక్కు డాకు మహారాజ్ గా వస్తున్నారు. కమర్షియల్ అంశాలతోనే ఎప్పుడూ…
తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…
నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…
తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…