పబ్లిక్ టాక్ బాగానే ఉంది. రివ్యూలు మెచ్చుకున్నాయి. కొంత గ్యాప్ తరువాత పాత నానిని చూశామని అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. అన్నీ అనుకూలంగానే కనిపిస్తున్నా అంటే సుందరం బాక్సాఫీస్ పరిస్థితి మాత్రం కొంచెం అటు ఇటుగానే ఉంది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు నాలుగు కోట్లకు దగ్గరగా వెళ్లిన షేర్ రెండో రోజు పర్వాలేదనిపించుకుంది. ఇవాళ ఆదివారం కాబట్టి మంచి నెంబర్స్ నమోదవుతాయి కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఉండాల్సిన రేంజ్ లో లేవని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.
లెన్త్ విషయంలో ఎన్ని కామెంట్స్ వస్తున్నప్పటికీ నిర్మాణ సంస్థ వాటిని సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ట్రిమ్ చేసే సూచనలు దరిదాపుల్లో లేవు. అలాంటిది ఏదైనా ఉంటే వీలైనంత త్వరగా చేస్తే మంచిది. లేకపోతే లాభముండదు.
తెలంగాణలో టికెట్ రేట్లు ఫ్యామిలీ ఆడియన్స్ మాస్ పై ప్రభావం చూపిస్తున్నాయని ఎందరు మొత్తుకుంటున్నా నిర్మాతలు లైట్ తీసుకుంటున్నారు. మేజర్, విక్రమ్ లకు హైదరాబాద్ లో 195 రూపాయలు ఉన్న మల్టీ ప్లెక్స్ ధర అంటే సుందరానికి 250కి పెరిగిపోయింది.
ఇలాంటి అంశాలే వసూళ్లను ప్రభావితం చేస్తున్నాయి. ఎఫ్3 సైతం ఇదే తరహా సమస్యను ఎదురుకుని కలెక్షన్లను తగ్గించుకోడం కళ్ళ ముందు కనిపిస్తోంది. ఏపిలో నార్మల్ గా ఉన్నందు వల్ల అక్కడ డీసెంట్ నెంబర్స్ వస్తున్నాయి. టాలీవుడ్ పెద్దలు గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలు విశ్లేషించుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిది.
స్టేజిల మీద, ఇంటర్వ్యూలలో రెండు ముక్కలు చెప్పేసి తర్వాత రియాలిటీలో తూచ్ అనేయడం మాములైపోయింది. సోమవారం అంటే రేపటి నుంచి అంటే సుందరానికి అసలైన పరీక్ష మొదలుకానుంది. థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న మొత్తానికి ఇంకా సగం దూరం కూడా చేరుకోలేదు మరి.
This post was last modified on June 12, 2022 7:02 pm
రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…
గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…
నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…
మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…