బాలీవుడ్ ఎన్ని మేకపోతు గాంభీర్యాలు పోయినా దేశవ్యాప్తంగా సౌత్ సినిమా డామినేషన్ అంతకంతా పెరుగుతోంది. క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలన్నా, విజువల్ గ్రాండియర్లతో విదేశీయులను మెస్మరైజ్ చేయాలన్నా అది మనవల్లే సాధ్యం అనేంతగా దక్షిణాది నవతరం దర్శకులు దూసుకుపోతున్నారు.
ఒకవైపు హిందీలో భూల్ భులయ్యా 2 లాంటి ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ మరీ దారుణంగా దెబ్బ తిన్నాయి. సామ్రాట్ పృథ్విరాజ్, జయేష్ బాయ్ జోర్దార్, హీరోపంటి 2, రన్ వే 34 కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేదు.
థియేటర్లలోనే కాదు ఓటిటిలోనూ ఇదే తరహా ట్రెండ్ కనిపిస్తోంది. ఇండియా వైడ్ అన్ని ప్లాట్ ఫార్మ్స్ లో ఉన్న టాప్ 10 చూసుకుంటే టాప్ 5లో నాలుగు మనవే ఉన్నాయి. మొదటి స్థానంలో ఆర్ఆర్ఆర్ తన విజయయాత్రను కొనసాగిస్తుండగా, రెండో ప్లేస్ ని మలయాళం సీరియస్ డ్రామా జనగణమన తీసుకుంది.
నాలుగో ర్యాంక్ లో కెజిఎఫ్ చాఫ్టర్ 2 ఫిక్స్ అయిపోగా రెండు రోజుల క్రితం రిలీజైన శివ కార్తికేయన్ డాన్ అప్పుడే అయిదో నెంబర్ తీసేసుకుంది. హిందీ నుంచి ఒక్క జయేష్ బాయ్ జోర్దార్ మాత్రమే టాప్ 3లో ఉంది.
మిగిలిన అయిదు చూస్తే పీకీ బ్లిన్డర్స్ 6, స్ట్రేంజర్ థింగ్స్ 6, మిస్ మార్వెల్, హిందీ వెబ్ సిరీస్ కోడ్ ఎం సీజన్ 2, మళయాలం మూవీ ట్వంటీ వన్ గ్రామ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మన కంటెంట్ ని నార్త్ ఆడియన్స్ ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమవుతోంది.
థియేటర్లలోనూ ఈ ప్రభావం ఉండటం వల్లే పుష్ప 2, రామ్ చరణ్ – శంకర్ ప్రాజెక్ట్, జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలతో పాటు ప్రభాస్ అన్ని సినిమాల డబ్బింగ్ హక్కుల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఒకప్పుడు చిరంజీవి లాంటి అగ్రహీరోలే ఎగురవేయలేకపోయిన మన జెండా ఇప్పటి హీరోలు డైరెక్టర్లు సగర్వంగా పాతేస్తున్నారు. ఇప్పట్లో కదిలించడం కష్టమే.
This post was last modified on June 12, 2022 11:17 am
క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…