ఇండియాలో థియేటర్లు మూడు నెలల కిందట్నుంచి మూతపడి ఉన్నాయి. థియేటర్లలో బొమ్మ పడక శత దినోత్సవం కూడా పూర్తయింది. ఇది ఎవ్వరూ ఊహించని విషయం. రాబోయే రెండు మూడు నెలల్లో కూడా థియేటర్లు పున:ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
లాక్‌డౌన్ కంటే ముందు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలన్నీ ఆపేసి కూర్చున్నారు. థియేటర్లు మళ్లీ తెరుచుకోబోతున్న సంకేతాలు వచ్చినపుడు, తమ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్నాక ప్రమోషన్ తిరిగి ఆరంభిస్తారేమో.
అంత వరకు స్తబ్దత కొనసాగేలాగే కనిపిస్తోంది. ఇప్పటికైతే పెద్ద సినిమాల సందడి ఏమాత్రం కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో తమిళ స్టార్ హీరో విశాల్ తన కొత్త చిత్రం ‘చక్ర’ ప్రమోషన్లతో హడావుడి చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కొన్ని రోజుల కిందట ట్రైలర్ గ్లింప్స్‌తో వార్తల్లోకి వచ్చింది ‘చక్ర’. ఇప్పుడు ఏకంగా ట్రైలరే రిలీజ్ చేసేస్తున్నారు. సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునేలా లేవు. ‘చక్ర’ రిలీజ్ డేట్ కూడా ఏమీ ఖరారవ్వలేదు. మరి ఇప్పుడు ఈ ట్రైలర్ హడావుడేంటి అన్న ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. ఒకవేళ ‘చక్ర’ను ఏదైనా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసే సాహసం విశాల్ చేయబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అలా అయితే తప్ప ఇప్పటికిప్పుడు ట్రైలర్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో ఇప్పటికే జ్యోతిక సినిమా ‘పొన్ మగళ్ వందాల్’తో పాటు కీర్తి సురేష్ మూవీ ‘పెంగ్విన్’ ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయితే అవి మీడియం రేంజ్ సినిమాలే.
ఆ సినిమాలు చూస్తే వీటికి థియేటర్లలో రిలీజయ్యేంత సీన్ లేదు అనిపించింది. ఐతే విశాల్ మూవీ అంటే దాని రేంజ్ వేరు. దానికి థియేట్రికల్ రిలీజే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకవేళ విశాల్ కనుక ‘చక్ర’ను ఓటీటీలో రిలీజ్ చేసేట్లయితే.. ఈ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కాబోతున్న తొలి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అదే అవుతుంది.
This post was last modified on June 27, 2020 1:44 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…