Movie News

సమ్మతమే సైలెన్స్ ఎందుకో

పెద్ద స్టారా చిన్న హీరోనా అనేది అనవసరం. బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రమోషన్ సినిమాలకు ఎంత పెద్ద హెల్ప్ అవుతోందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. కమల్ హాసన్ అంతటి వాడే కేవలం పది రోజుల వ్యవధిలో విక్రమ్ కోసం రెండుసార్లు హైదరాబాద్ వచ్చి ఈవెంట్లో పాల్గొనడమంటే మాములు విషయం కాదు. పబ్లిసిటీకున్న ప్రాముఖ్యత అది. ఫ్లాప్ అయితే ఎంతో కొంత రాబట్టుకోవాలన్నా, హిట్ అయితే ఇంకో రెండు వారాలు వసూళ్లు స్టడీగా వచ్చేలా చేయాలన్నా ప్రమోషన్లు చాలా కీలకం. దీనికి స్టార్ డంతో ముడిపెట్టలేం.

అలాంటిది ఇంకో రెండు వారాల్లో విడుదల పెట్టుకుని సైలెంట్ గా ఉండటం సమ్మతమే విషయంలో ఆశ్చర్యం కలిగిస్తోంది. చాలా రోజుల క్రితమే అఫీషియల్ గా జూన్ 24 రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. కానీ ఎందుకో ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అబ్బవరం రేంజ్ పెరిగిపోయింది. ఏకంగా ఏడెనిమిది సినిమాలు ఒప్పేసుకుని మోస్ట్ బిజీ యూత్ హీరోగా మారిపోయాడు. సెబాస్టియన్ డిజాస్టర్ అయినప్పటికీ ఇంకో సక్సెస్ వస్తే ఈజీగా మార్కెట్ ని మళ్ళీ కంట్రోల్ లోకి తీసుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో సమ్మతమే ఇంత సైలెంట్ గా ఉండటం వాయిదానే అనుమానం రేకెత్తిస్తోంది. ఎక్కువగా వెబ్ సిరీస్ లలో కనిపిస్తున్న చాందిని చౌదరి ఇందులో హీరోయిన్ కాగా గోపినాథ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టీజర్ తో పాటు శేఖర్ చంద్ర పాటలకు రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఎలాగూ 23న రామ్ గోపాల్ వర్మ కొండా తప్ప బాక్సాఫీస్ వద్ద ఏ పోటీ లేదు. మళ్ళీ జులైకి వెళ్ళిపోతే కష్టం. వారానికో క్రేజీ మూవీ ప్యాక్ అయ్యి ఉంది. పైగా షూటింగ్ చివరి స్టేజిలో ఉన్న నేను మీకు బాగా కావలసిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథలు సెప్టెంబర్ లోగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. మరి సమ్మతమే ముందు డేట్ కి కట్టుబడితేనే బెటర్.

This post was last modified on June 11, 2022 9:58 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

7 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

8 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

8 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

9 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

9 hours ago